Alia Bhatt, Ranveer: రణ్‌బీర్‌ను ఆలియా ‘సఖి’ అని అంటోంది ఎందుకో?

బాలీవుడ్‌లో మోస్ట్‌ యానిమేటడ్‌ యాక్టర్‌ ఎవరు అంటే.. అందరూ రణ్‌వీర్‌ సింగ్‌ పేరు చెబుతారు. సినిమాల్లో ఎలా అయితే రబ్బర్‌ బంతిలో ఎగురుతూ సందడిగా ఉంటాడో, బయట ఏదైనా షోకి వచ్చినా, టాక్‌ షో వచ్చినా అలానే ఉంటాడు. దానికి అతని డ్రెస్సింగ్‌ స్టయిల్‌ యాడింగ్‌ అని చెప్పొచ్చు. రెగ్యులర్‌ మగాళ్లు వేసుకునే డ్రెస్‌లు వేసుకుంటాడు. అయితే ఒక్కోసారి చిత్రవిచిత్రమైన డ్రెస్‌లు వేసుకుంటూ ఉంటాడు. మరి ఇంట్లోనూ ఇలానే ఉంటాడా? ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం వచ్చింది.

బాలీవుడ్‌ సెలబ్రిటీల పర్సనల్‌ విషయాలను బయటకు వెలికి తీసే కార్యక్రమం ‘కాఫీ విత్‌ కరణ్‌’ మళ్లీ వచ్చేసింది. తొలి ఎపిసోడ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ వచ్చారు. ఈ క్రమంలో రణ్‌వీర్‌ డ్రెస్సింగ్‌ గురించి ఆసక్తికరమైన చర్చ నడిచింది. చిత్రవిచిత్రమైన డ్రెస్సులు వేస్తుంటావు కదా.. మరి మీ అత్తగారింటికి (ప్రకాశ్‌ పడుకొణె) ఇంటికి వెళ్లినప్పుడల్లా ఇలాంటి డ్రెస్‌తోనే వెళ్తావా అని అడిగాడు కరణ్‌. ఈ క్రమంలో తమ ఇంట్లో రెండు రకాల వార్డ్‌ రోబ్‌లు ఉంటాయని చెప్పాడు.

ఒక వార్డ్‌ రోబ్‌లో తను రెగ్యులర్‌ బయటకు వెళ్లేటప్పుడు ధరించే ఫంకీ డ్రెస్‌లు, ఫ్యాషన్‌ డ్రెస్‌లు ఉంటాయట. మరో వార్డ్‌ రోబ్‌లో బ్లూ జీన్స్‌, వైట్‌ షర్ట్స్‌, టీ షర్ట్స్‌ ఉంటాయట. బెంగళూరు వెళ్లినప్పుడు ఫార్మల్‌ – జీన్స్‌లోనే వెళ్తాడట. ఇక ఇదే షోలో మరో విషయం కూడా తెలిసంది. అదే రణ్‌వీర్‌ – ఆలియాను ఒకరినొకరు ఏమని పిలుచుకుంటారు అని. చిన్న పిల్లలు పిలుచుకున్నట్లుగా టుటు – లులు అని పిలుచుకుంటారట. అలాగే ఇద్దరూ ‘సఖి’ అని కూడా పిలుచుకుంటారట.

అలాగే ‘గంగూభాయ్‌ కాఠియవాడి’ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఓ విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది ఆలియా. ఆ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఆలియా భయపడిందట. నేను చేయగలనా అని అనుకుంటూ రణ్‌వర్‌కి ఫోన్‌ చేసిందట. ఆ సమయంలో రణ్‌వీర్‌ చాలా ధైర్యం ఇచ్చాడని, అందుకే చేశానని చెప్పింది ఆలియా. అంతలా తమ మధ్య స్నేహం ఉందని చెప్పుకొచ్చింది ఆలియా.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus