వచ్చి వారం కాలేదు అప్పుడే పట్టుకుపోయాడు!

‘సీత’ వచ్చేసింది అంటూ… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మొన్న ఘనంగా రాజమౌళి- ఆలియా భట్‌ ఫొటోలు రిలీజ్‌ చేసింది. ఇక సినిమా చిత్రీకరణ స్పీడ్‌ అందుకుంటుంది అనుకునేసరికి మళ్లీ బ్రేక్‌ పడిందా? అవుననే అంటున్నాయ టాలీవుడ్‌ వర్గాలు. నిహారిక పెళ్లి అయ్యాక తిరిగి చరణ్‌ హైదరాబాద్‌ చేరుకోవడంతో సినిమా పనులు మొదలవుతాయి అనుకుంటుండగా… నిన్న రణ్‌బీర్‌ కపూర్‌ వచ్చి ఆలియా భట్‌ను తీసుకుపోయాడు. దీంతో మళ్లీ బ్రేక్‌ పడింది అంటున్నారు. ఇంతకీ ఏమైందంటే?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌ నుంచి ఆలియా జంప్‌ అంటూ సోమవారం మధ్యాహ్నమే కొన్ని వార్తలు వచ్చాయి. రణ్‌బీర్‌ కపూర్‌తో ఆలియా లాంగ్‌ ట్రిప్‌ అని కూడా పుకార్లు వినిపించాయి. అయితే ఆలియా ఎక్కడకు వెళ్లింది అనే విషయంలో స్పష్టత రాలేదు. అయితే మంగళవారానికి అసలు విషయం తెలిసింది. హైదరాబాద్‌లో మిస్‌ అయిన ఆలియా… రణ్‌బీర్‌తో కలసి గోవాలో కనిపించింది. ఇంతకీ ఈ ప్రేమ పావురాలు సోమవారం గోవాకు అత్యవసరంగా ఎందుకెళ్లాయో తెలుసా? ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూడటానికట.

అవును ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా ముంబయి జట్టుకు రణ్‌బీర్‌ కపూర్‌ సహయజమాని అన్న విషయం తెలిసిందే. సోమవారం గోవాలో జంషెడ్‌పూర్‌-ముంబయి సిటీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌ను చూడటానికే ఆలియాను రణ్‌బీర్‌ తీసుకెళ్లాడట. వారిద్దరూ మ్యాచ్‌ చూస్తున్న ఫొటోలను ముంబయి సిటీ జట్టు అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. దీంతో అసలు విషయం బయటపడింది.

మ్యాచ్‌ చూడటానికే ఆలియాను రణ్‌బీర్‌ తీసుకెళ్లాడా.. లేక విడిచి వారం అయిపోతోందనే ఎడబాటుతో ప్రేయసితో టైమ్‌ స్పెండ్ చేద్దామని తీసుకెళ్లాడా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే రణ్‌బీర్‌ – ఆలియా ట్రిప్‌ గోవాతో ముగిసిందా? లేక ముందుగా వార్తలొచ్చినట్లు వేరే ఎక్కడికైనా టూర్‌ ప్లాన్‌ చేశారా అనేది చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus