Alia,Ranbir: రణబీర్ తో అలియా ప్రేమ అలా మొదలైందట..!

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్, స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్‌ ఈ మధ్యనే 3 ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అంతేకాదు అలియా ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ ను కూడా అభిమానులతో పంచుకుంది. అయితే ఇప్పుడు ఆమె రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇక ఆమె నటిస్తున్న సినిమాలు లేట్ అవ్వచ్చు అనే ఊహాగానాలు కూడా షికారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తల పై అలియా క్లారిటీ కూడా ఇచ్చింది.

ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని డాక్టర్లు చెప్పారు కాబట్టి.. నాకు సినిమాల్లో నటించడానికి ఇబ్బంది లేదు అని ఆమె స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె హీరో రణ్ వీర్ సింగ్ తో కలిసి కాఫీ విత్ కరణ్ టాక్ షో లో పాల్గొంది.ఈ టాక్ షోలో భాగంగా రణభీర్ కపూర్ తో ఆమె ప్రేమ, పెళ్లి, ఆఖరికి ఫస్ట్ నైట్ వంటి విషయాలపై కూడా ఆమె స్పందించింది.

పెళ్లి తర్వాత ఫస్ట్ డెస్టినేషన్ గురించి చెప్పాలని కరణ్ జోహర్ ప్రశ్నించగా.. ‘ఫస్ట్ నైట్ అనేది ఉండదు.. ఆ టైమ్‌కు అలసిపోయి ఉంటాం..’ అంటూ అలియా భట్ బోల్డ్ రిప్లై ఇవ్వగా పక్కనే ఉన్న రణవీర్ సింగ్ పగలబడి నవ్వడం హైలెట్ గా నిలిచింది. అంతేకాదు అలియా- రణబీర్ ల లవ్ ఎక్కడ మొదలైంది అనే ప్రశ్న అలియాకి ఎదురైంది. అందుకు ఆమె ‘ ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ టైంలో నేను రణబీర్ ఫ్లైట్ లో ప్రయాణం చేయాల్సి వచ్చింది.

అప్పుడు రణబీర్ తన సీటు పై ఏదో పడడం వలన వచ్చి నా పక్క సీట్ లో కూర్చుకున్నాడు. ఆ టైంలో సినిమా గురించి చాలా డిస్కస్ చేసుకున్నాం. అప్పుడే మా రొమాన్స్ కూడా మొదలైంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం సెప్టెంబర్ 9న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus