Star Actress: నెపోటిజం మీద స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌… వాళ్లందరి నోళ్లు మూతపడేలా..

బాలీవుడ్‌లో నెపోటిజం అంటే ఠక్కున గుర్తొచ్చే హీరోయిన్‌ పేర్లలో ఆలియా భట్ తొలి స్థానాల్లో ఉంటుంది. నటన, అందం, ఫిగర్‌, హంగు అన్నీ ఉన్నా.. ఆమెను నెపో కిడ్‌ అని అంటుంటారు. దానికి ఆమె ఎంతగా వ్యతిరేకించినా, ఎన్నిసార్లు కాదని క్లారిటీ ఇచ్చినా ఎవరూ వినడం లేదు. ఆమె ఓ షోలో ఏదో పొరపాటను చెప్పిన సమాధానాన్ని పట్టుకుని ఆమె గురించి తక్కువ చేసి మాట్లాడారు. తాజాగా ఆలియా మరోసారి నెపోటిజం మీద కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.

ఆలియా భట్‌ (Alia Bhatt) ‘గంగూబాయి కాఠియావాడి’ సినిమాతో ఇటీవల జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ క్రమంలో ఓ మీడియాతో మాట్లాడుతూ సినిమా రంగంలో తాను ఈ స్థాయికి రావడానికి ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడాడింది. ఈ క్రమంలోనే నెపోటిజం గురించి, ఆ మాటల వల్ల తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడింది. ఇప్పుడు ఆ మాటలే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

చిత్రపరిశ్రమతో మా కుటుంబానికి ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. నటన వైపు నేను రావడానికి మా నాన్న మహేష్‌ భట్‌ అస్సలు కారణం కాదు. ఆయన నాకు కనీసం ఒక్క సినిమా అవకాశం కూడా ఇవ్వలేదు అని చెప్పింది ఆలియా. ‘నీకు సినిమాలో నటించాలనుంటే చెప్పు అవకాశం ఇస్తాను’ అని మా నాన్న ఎప్పుడూ మాకు చెప్పలేదు అంటూ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే నెపోటిజానికి మేం పూర్తిగా వ్యతిరేకం అని తెలిపింది.

అంతేకాదు తాను పరిశ్రమలో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అన్నా, ఇలాంటి సినిమాలు చేస్తున్నా అన్నా ఎంత కష్టపడాను అనేది ప్రేక్షకులకు తెలుసు. నేనేదో ఓవర్ నైట్‌ ఈ స్టార్‌డమ్‌ను సంపాదించుకోలేదు. ఎన్నో సినిమాల కష్టం ఇది అని చెప్పుకొచ్చింది. నిజానికి ఆలియా కెరీర్‌ అలానే సాగింది. అయితే మహేష్‌ భట్‌ అవకాశాలు ఇవ్వకపోయినా.. బాలీవుడ్‌ నెపోకిడ్స్‌ను బాగా ఎంకరేజ్‌ చేసే కరణ్‌ జోహార్‌ ఆలియాకు సాయం చేశారని ఓ టాక్‌ అయితే ఉంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus