బాలీవుడ్‌కి పట్టి పీడిస్తున్న సమస్యల్లో… అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోవడం ఒకటైతే, రెండోది బాయ్‌కాట్ ట్రెండ్. ఏదేదో కారణం చూపిస్తూ ఫలానా బాలీవుడ్ సినిమాను బాయ్‌కాట్ చేయండి అంటూ పిలుపు ఇవ్వడం. తాజాగా ఇలాంటి ట్రెండ్ వల్ల ఇబ్బంది పడిన సినిమాల నటలు చాలా గరంగరంగా ఉన్నారు. మొన్నీమధ్య కరీనా కపూర్ బాయ్‌కాట్ ట్రెండ్‌పై మండిపడితే.. ఇప్పుడు ఆమె మరదలు ఆలియా భట్ కూడా అలానే మాట్లాడుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సమయంలో ‘బాలీవుడ్ మాఫియా’, ‘నెపోటిజం’ అనేవి బయటకు రాగా..
ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన సినిమాల మీద బాయ్‌కాట్ అంటూ మరొకటి బయటికొచ్చింది. ఈ మూడు విషయాల గురించి మాట్లాడినా, సపోర్టు చేసినా వాళ్ల సినిమాల్ని కూడా బాయ్‌కాట్ చేసేయడానికి కొంతమంది సిద్ధమవుతున్నారు. ‘లాల్‌సింగ్‌చడ్డా’ విడుదల సమయంలో ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ మాట్లాడుతూ ‘ఇష్టం లేకపోతే సినిమా చూడటం మానేయండి’ అని అంది. దీంతో పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత ఆమె ‘తప్పు తప్పు’ అంటూ క్షమాపణలు చెప్పినా.. జనాలు వినే పరిస్థితుల్లో లేరు.
ఇంత జరిగిన తర్వాత కూడా ఆలియా భట్ ఇలానే మాట్లాడటం గమనార్హం. ఇటీవల అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో నెపోటిజం, బాయ్‌కాట్ ట్రెండ్‌పై స్పందించింది. నెపోటిజం గురించి మాట్లాడుతూ ‘‘ఫలానా కుటుంబంలో పుట్టాలని నేను కోరుకుని పుట్టానా? సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల్లో పుడితే, తొలి సినిమా వరకే అది ఉపయోగపడుతుంది. అసలు ఆ కుటుంబంలోనే పుట్టడం తప్పంటే ఎలా? నేను మీకు నచ్చకపోతే నన్ను చూడొద్దు. దానికి నేనేమీ చేయలేను’’ అంటూ ఫైర్ అయ్యింది ఆలియా.
దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో బాయ్‌కాట్ బ్యాచ్ మళ్లీ యాక్టివేట్ అయ్యి.. అలియా నటించిన చిత్రాలేవీ చూడొద్దంటూ ట్వీట్లు పెడుతున్నారు. దీంతో వచ్చే నెల విడుదల కానున్న ‘బ్రహ్మాస్త్ర’పై ఆలియా మాటల ప్రభావం పడనుంది అని అంటున్నారు. రూ. 500 కోట్ల ప్రాజెక్ట్ అది. ప్రస్తుతం బాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులు తెలిసి కూడా అలియా ఇలా మాట్లాడటం సరికాదని కొందరు అంటున్నారు. ఇంకొందరు అయితే బాయ్‌కాట్ బ్యాచ్ వల్లే ఆమె అలా మాట్లాడారు అని ఆరోపిస్తున్నారు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?