సెట్ లో కళ్లు తిరిగిపడిపోయిన స్టార్ హీరోయిన్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా భట్ ప్రస్తుతం తీరిక లేకుండా పని చేస్తోంది. ఆమె నటిస్తోన్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. ఒక సినిమా షూటింగ్ హైదరాబాద్, మరొకటి ముంబైలో, మరొకటి ఢిల్లీలో షూటింగ్ లు జరుగుతున్నాయి. కోవిడ్ తరువాత సినిమా షూటింగ్ లు మొదలుకావడంతో అందరూ ఆమె డేట్స్ కోసం ఎగబడ్డారు. ముందుగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది అలియా. ఆ తరువాత సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న ‘గంగూబాయి’ సినిమా షూటింగ్ లో చేరింది.

ఇక గత నెలలో రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. కొన్నిరోజులకే హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లిపోయింది. ప్రస్తుతం అలియా ‘గంగూబాయి’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం రాత్రి సమయంలోనే తీస్తున్నారట దర్శకుడు సంజయ్ భన్సాలీ. దాంతో నిద్రలేమితో అలియా ఆరోగ్యం అప్సెట్ అయింది. ఆదివారం నాడు సెట్ లో కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆమెని ముంబైలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారట.

ఒకరోజులోనే ఆమె రికవర్ అవ్వడంతో డిశ్చార్జ్ కూడా చేశారని తెలుస్తోంది. వచ్చే నెలలో అలియా మరోసారి హైదరాబాద్ కు రానుంది. ‘ఆర్ఆర్ఆర్’ కొత్త షెడ్యూల్ లో రామ్ చరణ్, అలియాపై ఓ పాటను చిత్రీకరించనున్నారట. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాకీ ఉన్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus