Alia, Ranveer: అలియా భట్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు కారణం?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. అటు తర్వాత పెళ్లి వార్తలతో మరింత పాపులార్ అయ్యింది. కొన్నేళ్లుగా ప్రేమించిన స్టార్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుని మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల ఈమెకు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈమె సినిమాల్లో నటిస్తూనే వస్తుంది.

ఈ మధ్యనే తన హాలీవుడ్ ఎంట్రీ మూవీని కూడా ఫినిష్ చేసింది. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోకి ఈమె గెస్ట్ గా విచ్చేసింది. రన్వీర్ సింగ్ కూడా ఈమె పాల్గొన్న ఎపిసోడ్ కు వచ్చాడు. ఈ క్రమంలో కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. అయితే రన్వీర్ ని ఉద్దేశించి అలియా చేసిన ఓ పనికి మాత్రం విమర్శల పాలవుతుంది.

మేటర్ ఏంటంటే.. హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు రన్వీర్ తో పోటీపడి సమాధానం ఇస్తున్న టైంలో తన మిడిల్ ఫింగర్ ను రన్వీర్ కి చూపించింది. అలియా చేసిన పనిని రన్వీర్ లైట్ తీసుకున్నాడు. కానీ.. అతన్ని అభిమానించే వారు మాత్రం అలియా పై మండి పడుతున్నారు.

అలియా చేసిన పనేమీ బాలేదని, స్టార్ హీరో పట్ల అలా ప్రవర్తించడం అసభ్యంగా ఉందంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు. అంతేగాక పెళ్లి తర్వాత అలియా భట్ కు కొంచెం ఎక్కువైందని, ఆమె ‘సతీ సావిత్రి పాత్ర’ ముగిసిందని కూడా ఘోరంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus