Alia Bhatt Baby Name: రణ్‌బీర్, ఆలియాల కుమార్తె పేరుకి ఎన్ని అర్థాలో తెలుసా!

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ తమ లవ్ మేటర్ రివీల్ చేసినప్పటినుండి మీడియా, సోషల్ మీడియాకి కావాల్సినంత స్టఫ్ ఇస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఇరు కుటంబాల అంగీకారంతో లవ్ కమ్ అరైంజ్డ్ మ్యారేజ్ చేసుకుని.. హిందీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్‌గా నిలిచారు. 2018 నుండి రిలేషన్‌లో ఉన్న ఈ జంట.. ఈ ఏడాది ఏప్రిల్ 14న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.

ఈ నవంబర్ 6న ఆలియా పండంటి పాపకు జన్మనిచ్చింది. అమ్మనయ్యాను.. మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నానని తన ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆలియా.. గురువారం తమ కుమార్తెకు పేరు పెట్టామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఆలియా, రణ్‌బీర్ తమ గారాలపట్టీకి ‘రాహా’ అనే పేరు పెట్టారు. అలాగే ఈ ‘రాహా’ అనే పేరుకి ఏ ఏ భాషలో ఎలాంటి అర్థం, అర్థాలు వస్తాయనేది కూడా వివరంగా వివరించింది ఆలియా..

‘రాహా’ అంటే దైవ మార్గమని, స్వాహిలి భాషలో ఆనందమని, సంసృతంలో వంశమని, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, ఉపశమనం.. అలాగే అరబిక్‌లో శాంతి, స్వేచ్ఛ, సంతోషం అనే అర్థాలు వస్తాయని వెల్లడించింది. ఎన్నో పేర్లు పరిశీలించిన తర్వాత పాపకి ఇంత బ్యూటిఫుల్ నేమ్ తన భర్త రణ్‌బీర్ పెట్టాడని.. ‘రాహా’ రాకతో తమ జీవితం కొత్తగా ప్రారంభమైందని, తనతో గడిపే ప్రతిక్షణం ఎంతో ప్రేమానురాగాలతో కూడుకున్నదని చెప్పుకొచ్చింది.

‘పాప పేరు చాలా బాగుంది.. ఒక్క పేరుకి ఎన్ని అర్థాలో.. భలే ఉంది.. గాడ్ బ్లెస్.. పాప పిక్ కూడా పోస్ట్ చేసుంటే బాగుండేది’ అంటూ ఆలియా, రణ్‌బీర్ ఫ్యాన్స్, బాలీవుడ్ సెలబ్రిటీలు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాపను ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లో గోడ మీద ఉన్న టీ షర్ట్‌పై ‘రాహా’ పేరు రాసి ఉంది. పేరు రివీల్ చేసిన ఈ జంట తమ చిన్నారిని మాత్రం చూపించలేదు. ఆలియా చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus