Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

సీనియర్ స్టార్ హీరోలను… ఇంకా హీరోలుగానే చూడాలని అభిమానులు కానీ, ప్రేక్షకులు కానీ అనుకోవడం లేదు. ఈ విషయాన్ని సీనియర్లు యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న సీనియర్ స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టి వంటి వారు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించారు. ‘బన్నీ’ సినిమాలో శరత్ కుమార్ పాత్రకు మమ్ముట్టిని అడిగితే చేయనని చెప్పినట్టు అప్పట్లో ప్రచారం గట్టిగా జరిగింది.

Coolie

అలాంటి మమ్ముట్టి మొత్తానికి రియలైజ్ అయ్యి అఖిల్ ‘ఏజెంట్’ సినిమాలో కీలక పాత్ర చేశాడు. అలాగే ‘భ్రమయుగం’ సినిమాలో విలన్ గా చేశాడు. సక్సెస్ దక్కింది. మోహన్ లాల్ కూడా ఇందుకు సిద్దంగానే ఉన్నారు. ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ వంటివి చేశారు. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా ప్రభాస్ ‘కల్కి 2898 ad’ లో విలన్ గా చేయడానికి రెడీ అయ్యారు.

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నాగార్జున కూడా పంధా మార్చారు.’కూలీ’ లో విలన్ గా చేశారు. ఈ సినిమా గురించి తమిళ ప్రేక్షకుల కంటే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే నాగార్జున విలన్ గా ఏ స్థాయిలో ఫిట్ అయ్యారు.

మిగిలిన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు కూడా ఇలాంటి పాత్రలు చేసే అవకాశం ఉందా? లేదా? అనే ఆలోచనలతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెంకటేష్ ‘నాగవల్లి’ సినిమా టైంలోనే విలన్ రోల్ చేయాలని ఉంది అని చెప్పారు. కానీ చేయలేదు. బాలకృష్ణ, చిరంజీవి సైతం విలన్స్ గా మెప్పించాలని చూస్తున్నారు. మరి వారి సెకండ్ ఇన్నింగ్స్ ను ‘కూలీ’ రిజల్ట్ ను బట్టి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.

‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus