ఈ ఏడాది తెరపై కనిపించని హీరోలు వీళ్లే..!

సీనియర్, యంగ్ హీరోలంతా వరుసపెట్టి సినిమాలు లైనప్ చేసేస్తున్నారు.. ఒకటి సెట్స్ మీద ఉండగానే మరో మూవీ అనౌన్స్‌మెంట్ ఇచ్చేస్తున్నారు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ విషయంలో అందరికంటే టాప్‌లో ఉన్నాడు.. మిగతా హీరోలు కూడా తక్కువలో తక్కువ రెండు, మూడు చిత్రాలు చేతిలో ఉండేలా చూసుకుంటున్నారు. దాదాపు అందరు హీరోలు కూడా వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేసి ప్రేక్షకాభిమానులను ఎంటర్‌టైన్ చేయాలనుకుంటారు.

కానీ కొన్నిసార్లు ప్లాన్ రివర్స్ అవుతుంది. ప్రాజెక్టులు పట్టాలెక్కడం, సరూన కాంబో సెట్ కాకపోవడం, షూటింగ్స్ ఆలస్యమవడం లాంటివి కారణాలుగా చెప్పుకోవచ్చు.. ప్రస్తుతం చేతిలో సినిమాలున్నా కానీ ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ మీదకు రాని టాలీవుడ్ స్టార్స్ కొందరు.. వచ్చే ఏడాది డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామంటున్నారు.. ఆ హీరోలెవరో చూద్దాం..

కింగ్ నాగార్జున..

2022 సంక్రాంతికి తనయుడు నాగ చైతన్యతో కలిసి ‘బంగార్రాజు’ గా బాక్సాఫీస్ బరిలో సూపర్ హిట్ కొట్టారు కింగ్ నాగార్జున.. తర్వాత దసరాకి ‘ఘోస్ట్’ గా వచ్చారు కానీ ఈ మూవీ అనుకున్నంతగా ఆడలేదు. కట్ చేస్తే తదుపరి చిత్రం ఏంటనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.. రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్, ‘గాడ్ ఫాదర్’ ఫేమ్ మోహన్ రాజా కథలు చెప్పారని.. 99వ సినిమా మలయాళ రీమేక్ అని.. ప్రసన్న డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడని.. 100వ సినిమాకి మోహన్ రాజా దర్శకుడని టాక్ కానీ క్లారిటీ లేదు.. ఒకవేళ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా కానీ రిలీజ్ వచ్చే ఏడాదే ఉంటుంది.. సో, ఈ సంవత్సరం నాగ్ సినిమా లేని లోటుని చైతన్య ‘కస్టడీ’ తో, అఖిల్ ‘ఏజెంట్’ తో తీర్చబోతున్నారు..

జూనియర్ ఎన్టీఆర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెరమీద కనిపించి ఏడాది కావొస్తుంది.. కొరటాల శివతో చేయబోయే సినిమా (NTR 30) ఈ నెలలోనే పూజ, రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతాయి.. 2024 ఏప్రిల్ 5 రిలీజ్ అని అనౌన్స్ చేసేశారు.. తారక్ ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్స్ హంగామా ముగించుకుని రాగానే పనులు వేగవంతమవుతాయి..

రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇంతలో డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్ 2’ షూటింగ్‌కి షిఫ్ట్ అయిపోయారు. చెర్రీ బర్త్‌డే సందర్భంగా RC 15 టైటిల్ రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.. 2024 సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్నట్లు నిర్మాత దిల్ రాజు చెప్పడంతో.. ఈ ఏడాది చరణ్ తెరమీద కనిపించడం కష్టమేనని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.. కానీ వచ్చే పెద్ద పండక్కి పాన్ ఇండియా లెవల్లో సందడి చేస్తాడని ధీమాతో ఉన్నారు..

అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ల ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప : ది రూల్’ పార్ట్ 1 లానే ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు.. కానీ, స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో లేటుగానే షూట్‌కి వెళ్లారు.. భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో కాస్త నెమ్మదిగానే అంటే వచ్చే ఏడాదిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus