టాలీవుడ్ లో దాదాపుగా 30ఏళ్ల పాటు టాప్ హీరోగా మెగాస్టార్ స్థానంలో ఉన్న చిరంజీవి అనుకోకుండా రాజకీయాల దారి తొక్కి…కాస్త ఇబ్బంది పడినట్లే కనిపించినా….మళ్ళీ వెంటనే తేరుకుని సినిమా రంగంలోకి దూకేసారు…అయితే ఒక రకంగా చిరు రెండో ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నప్పటికీ ఊపు మాత్రం మంచి భారీగా ఉంది….ఇదిలా ఉంటే ఈ సినిమా యూనిట్ ఈ మధ్యనే యూరప్ లో పాటల చిత్రీకరణ ముగించుకుని హైదరాబాద్ తిరుగి వచ్చింది…ఇంకా కొన్ని సీన్స్ మినహాయిస్తే…సినిమా దాదాపుగా పూర్తి అయినట్లే…అయితే అదే క్రమంలో ఈ సినిమా ఆడియో వేడుకపై ఫోకస్ పెట్టారు చిరు అండ్ చెర్రీ…దాదాపుగా 9ఏళ్ల తరువాత చిరు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం, అంతేకాకుండా అన్ని రకాలుగా కలసి వచ్చేలా….వచ్చే నెల 18న ఆడియో వేడుకను ప్లాన్ చేసినట్లు సమాచారం.
అంతేకాదు ముంబాయికి చెందిన ఒకప్రముఖ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి ఇప్పటికే ఈబాధ్యతలు అప్పగించినట్లు టాక్ కూడా వస్తుంది…ఇదిలా ఉంటే అసలు ట్విష్ట్ ఇక్కడే ఉంది…ఈ ఆడియో వేడుకకు ఎలా అయినా పవన్ ను ముఖ్య అతిధిగా తీసుకురావాలి అని చిరు అండ్ చెర్రీ భావిస్తున్నారు…అంతేకాదు…పవన్ ను తీసుకు వచ్చేందుకు మెగా ఫ్యామిలీ లో చాలా మంది ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్ కు అతిధిగా చిరంజీవి వచ్చిన విషయాన్ని గుర్తుకు చేస్తూ అదేపద్ధతిలో పవన్ కూడ ‘ఖైదీ నెంబర్ 150’ ఆడియో ఫంక్షన్ కు రావడం కనీసబాధ్యత అని మెగా కుటుంబ సభ్యులు పవన్ కు సున్నితంగా చెబుతున్నప్పటికీ ఆది కాస్త పవన్ కు ఒత్తిడి పెంచుతున్నట్లు టాక్. మరి ఈ నిర్ణయాన్ని పవన్ ఒకే చేస్తాడో లేక తిరస్కరిస్తాడో చూడాలి.