స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మూడు ఆప్షన్లు రెడీ చేశారు. ఒకటి, తలకోన ఫారెస్ట్. రెండు, ఈస్ట్ గోదావరిలో మారేడుమిల్లి ఫారెస్ట్. మూడు, వికారాబాద్ ఫారెస్ట్. అల్లు అర్జున్ ఏది సెలెక్ట్ చేస్తే అందులో షూటింగ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘పుష్ప’. యాక్చువల్లీ, మార్చికి ముందు ఇండియాలోకి కరోనా రానప్పుడు కొంత షూటింగ్ చేశారు.
అల్లు అర్జున్ ఇంపార్టెంట్ సీన్లు షూట్ చెయ్యాలనుకున్నప్పుడు బ్రేక్ పడింది. నిర్మాతలు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు షూటింగ్ చెయ్యడానికి అల్లు అర్జున్ రెడీ అన్నాడట. కరోనా నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి ముందూవెనుకా ఆలోచిస్తోంది. నవంబర్‌లో రీస్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేసింది.
ఈలోపు అల్లు అర్జున్ మూడు ఫారెస్ట్ ఏరియాల్లో ఒక ఏరియాను సెలెక్ట్ చెయ్యాల్సి ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’ కథ సాగుతుందనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఆల్రెడీ సాంగ్స్ కంపోజ్ చేశారట.
Most Recommended Video
వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!