కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) తెరకెక్కించిన ‘అపరిచితుడు’ చిత్రాన్ని ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేరు. విక్రమ్ (Vikram) , సదా (Sadha) జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆ రోజుల్లోనే నిర్మాత వి రవిచంద్రన్ (V. Ravichandran) రూ.20 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రభుత్వ అధికారులు,కార్పొరేట్ కంపెనీ..లు చేసే అవినీతిని.. ఓ స్ప్లిట్ పర్సనాలిటీ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్రం కథాంశం. 2005లో రిలీజైన ఈ సినిమా తమిళ, తెలుగు బాక్సాఫీస్..
వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ ఏడాదికి గాను ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో హీరో విక్రమ్ తెలుగులో కూడా మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నాడు. రామ, రెమో, అపరిచితుడు.. వంటి మూడు వైవిధ్యమైన పాత్రల్లో అతను తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక ఇప్పుడు రీ రిలీజ్‌ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ‘అపరిచితుడు’ చిత్రాన్ని మే 17న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘అపరిచితుడు’ సినిమాలో చెప్పుకోడానికి చాలా హైలెట్స్ ఉంటాయి. విక్రమ్, ప్రకాష్ రాజ్(Prakash Raj)..ల మధ్య వచ్చే సన్నివేశాలు.. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అందరినీ కట్టిపడేస్తుంది. హ్యారీష్ జైరాజ్ (Harris Jayaraj) సంగీతం కూడా సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ‘కుమారి’ అనే పాట ఇప్పటికీ టీవీల్లో మార్మోగుతూనే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా టాప్ నాచ్ లో ఉంటుంది. ఇవన్నీ రిపీట్ వాల్యూస్ అనే చెప్పాలి.