Balakrishna: బాలయ్య – బోయపాటి 4వ సినిమాకి ముహూర్తం ఫిక్స్?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ ఏడాది ‘వీరసింహారెడ్డి’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది. ప్రస్తుతం బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయ్యింది. అది ఫ్యాన్స్ కు పెద్దగా ఎక్కలేదు అనే చెప్పాలి. ‘పరమవీరచక్ర’ ‘లయన్’ వంటి డిజాస్టర్ సినిమాల్లో బాలయ్య లుక్ ఎలా ఉందో.. అలా ఉంది అంటూ అభిమానులు దర్శకుడు అనిల్ రావిపూడి పై ఫైర్ అయ్యారు.

ఇక అంతకు ముందు ‘వీరసింహారెడ్డి’ లో గోపీచంద్ మలినేని పెద్ద బాలయ్య లుక్ కు తీసుకున్న జాగ్రత్త.. చిన్న బాలయ్య లుక్ కు తీసుకోలేదు. సో బాలయ్యని అన్ని విధాలుగా సూపర్ అనిపించేలా చూపించాలి అంటే అది బోయపాటి వల్లే అవుతుంది అని ఈ యంగ్ డైరెక్టర్స్ వల్ల అందరికీ తెలిసొచ్చింది. అందుకే బాలయ్య – బోయపాటి ల కాంబోలో మళ్ళీ సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం బోయపాటి.. రామ్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

మే నెలకు షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాలయ్య – అనిల్ రావిపూడి ల షూటింగ్ జూలైలో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో బాలయ్య – బోయపాటి ల కాంబోలో నాలుగో మూవీని జూన్ 10న పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారట. ఆరోజున బాలకృష్ణ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. సో ఈసారి బాలయ్య పుట్టినరోజు అభిమానులకు డబుల్ ఫీస్ట్ అని తెలుస్తుంది.

అయితే ఈ ప్రాజెక్టుని ఎవరు నిర్మిస్తారు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. బాలయ్యతో సినిమా చేయడానికి మైత్రి సంస్థ మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మరోపక్క ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థల్లో సినిమాలు చేయడానికి బాలయ్య ఎప్పుడో సైన్ చేశాడు. చూడాలి మరి.. ఈ బ్యానర్లలో ఏది ‘#BB4’ ని నిర్మిస్తుందో..!

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus