చిరు – శంకర్ కాంబో ఫిక్స్ అయినట్టేనా…!

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’ తో నెరవేరింది. అయితే మెగాస్టార్ కు తీరని మరో కోరిక ఉందట. అది మెగాస్టార్ కోరిక మాత్రమే కాదు.. మెగా ఫ్యాన్స్ అందరి కోరిక అనే చెప్పాలి. శంకర్ … అర్జున్ తో తీసిన ‘జెంటిల్ మెన్’ చిత్రం విడుదలైన దగ్గర నుండీ మెగాస్టార్ చిరంజీవికి శంకర్ తో సినిమా చెయ్యాలి అని ఆశ అని తెలుస్తుంది. నిజానికి మెగాస్టార్ ‘జెంటిల్ మెన్’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసారు. నిజానికి ఈ చిత్రాన్ని శంకరే డైరెక్ట్ చెయ్యాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల వల్ల…బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న… మహేష్ బట్ తో హిందీ వెర్షన్ ను డైరెక్ట్ చేయించారు. కానీ ఈ చిత్రం అక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇది పక్కన పెడితే … రజినీ – శంకర్ కాంబో లో వచ్చిన ‘రోబో’ ఆడియో రిలీజ్ లో కూడా చిరు … మీతో సినిమా చెయ్యాలని ఉంది అంటూ దర్శకుడు శంకర్ తో చెప్పారు. అయితే శంకర్ నుండీ తరువాత ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అయితే అనేక సార్లు ఈ కాంబో సెట్ అయ్యింది అంటూ వార్తలు వచ్చాయి కానీ వర్కౌట్ కాలేదు.

అయితే ఇప్పుడు మాత్రం నిజంగానే ఈ కాంబో సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ చెన్నై మీడియా వర్గాల నుండీ సమాచారం అందింది. ప్రస్తుతం కమల్ తో ‘ఇండియన్2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శంకర్.. ఇది పూర్తయ్యాక ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. అందులో చిరు అలాగే మరో స్టార్ హీరో ఉంటారని తెలుస్తుంది. అల్లు అరవింద్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus