గ్రేట్‌ కాంబో: ఇండస్ట్రీ కష్టకాలంలో వాళ్లిద్దరూ అందుకే కలుస్తున్నారా?

బాలీవుడ్‌కి అర్జెంట్‌గా ఓ టానిక్‌ కావాలి. వరుస పరాజయాల తర్వాత ఇప్పుడిప్పుడే విజయాలు అందుకుంటున్న హిందీ పరిశ్రమకు మరింత బలం వచ్చేలా మంచి హిట్‌ పడాలి. అయితే ఇది స్టార్‌ హీరో, స్టార్‌ డైరక్టర్‌, స్టార్‌ నిర్మాతల కాంబినేషన్‌కే సాధ్యం. అందుకే బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో జరిగినదానికి భిన్నంగా కొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి, మరికొన్ని ప్రాజెక్టులు ఓకే అవుతున్నాయి, ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అలా ఓ 25 ఏళ్ల కాంబో రిపీట్‌ కాబోతోంది అంటున్నారు.

బాలీవుడ్‌లో ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా గురించి కథలు కథలుగా చెబుతుంటారు. ఎందుకంటే ఆ సినిమా ఉత్తరాదిలో అందుకున్న విజయం అలాంటిది. ఆ రోజుల్లో ఆ సినిమా ఓ సంల‌చ‌నం అని చెప్పాలి. స‌ల్మాన్ ఖాన్ – క‌రణ్ జోహార్ కాంబినేషన్‌లో రూపొందిన ఆ సినిమా ట్రెండ్ సెట్ట‌ర్ అని చెప్పాలి. స‌ల్మాన్ న‌ట‌న‌, కరణ్‌ మేకింగ్‌, ఆ పాటలు అబ్బో అదో అద్భుతం అని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత ఎందుకో కానీ మళ్లీ ఆ ఇద్దరూ కలవలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు అంటే 25 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్నారని టాక్‌.

స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా క‌రణ్ జోహార్ ఓ సినిమా చేయ‌డానికి ప్లాన్‌ సిద్ధమైంది అంటున్నారు. అయితే ఈ సినిమాకు క‌ర‌ణ్ జోహార్‌ కేవ‌లం నిర్మాత మాత్ర‌మే. ‘షేర్ షా’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విష్ణు వ‌ర్దన్ ఈ సినిమాను తెరకెక్కిస్తారట. విష్ణువర్దన్‌ అంటే మనకు బాగా తెలిసిన దర్శకుడే. పవన్‌ కల్యాణ్‌తో ‘పంజా’ను తెరకెక్కించింది ఆయనే. ఆ సినిమా సరైన విజయం అందుకోకపోయినా పవన్‌ను ఆయన చూపించిన విధానం ఇప్పటికీ హైలైట్‌ అని చెప్పాలి.

నవంబరులో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాను 2024 క్రిస్మస్‌ కానుకగా అభిమానుల ముందుకు తీసుకొస్తారట. మరి సల్మాన్‌ను విష్ణు వర్ధన్‌ ఎలా చూపిస్తారో చూడాలి. ఎందుకంటే ఆయన ఫ్రేమ్‌లో హీరో ఎప్పుడూ లార్జర్‌ ద్యాన్‌ లైఫ్‌గానే కనిపిస్తాడు. అలాగే మాసీగానూ ఉంటాడు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus