టాలీవుడ్‌లో కొద్ది రోజుల నుండి స్టార్ హీరోల పుట్టినరోజులు, సూపర్ హిట్ సినిమాల ల్యాండ్ మార్క్ ఇయర్స్‌కి స్పెషల్ షోలు.. ఇంకో అడుగు ముందుకేసి ఫిలిం నుండి డిజిటల్‌లోకి కన్వర్షన్ చేయించి పాత చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.. దీనికి ఫ్యాన్స్, ఆడియన్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాల నుండి మంచి ఫీడ్‌బ్యాక్ కూడా వచ్చింది.. ఈ బాటలో మరికొన్ని సినిమాలు కూడా రాబోతున్నాయి..
ఇప్పుడు హిందీ పరిశ్రమ కూడా ఈ రూట్‌లోకి వస్తోంది. తాజాగా మూవీ లవర్స్‌కి లెజెండరీ బాలీవుడ్ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న కొత్త సినిమా ‘పఠాన్’ టీజర్‌ని ఆయన పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2న విడుదల చెయ్యనుందని అందరూ భావిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఫ్యాన్స్, ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’ మూవీని రీ రిలీజ్ (హెచ్‌డి క్వాలిటీ) చెయ్యాలని ప్లాన్ చేశారు. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. ఈ మూవీ తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడు.. ప్రపంచవ్యాప్తంగా హిందీ పరిశ్రమ పేరు మారుమ్రోగేలా చేసిన ఆల్ టైమ్ క్లాసిక్ ఇది.. బాంబేలోని మరాఠా మందిర్‌లో ఏకంగా 1200 ల వారాలకు పైగా ఆడి ఎవర్ గ్రీన్ రికార్డ్ నెలకొల్పింది..
ఆదిత్య చోప్రా దర్శకత్వంలో, యశ్ చోప్రా నిర్మించిన ఈ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ షారుఖ్, కాజల్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌గా.. భారతీయ చలనచిత్ర చరిత్రలో వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. తెలుగులో డబ్ చేస్తే ఇక్కడ కూడా హిస్టరీ క్రియేట్ చేసింది. కథ, పాటలు, నటీనటులు, క్యారెక్టర్లు.. ఇలా ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో చెరుగని ముద్ర వేసింది.. 1995 అక్టోబర్ 20న విడుదలైన డీడీఎల్‌జే.. 27 సంవత్సరాల తర్వాత ఈ నవంబర్ 2న నార్త్‌లో పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలిస్ వంటి మల్టీప్లెక్సుల్లో రీ రిలీజ్ అవుతోంది.