Ganguly Biopic: ‘దాదా’ బయోపిక్‌… ఆ స్టార్‌ నో చెప్పాడా? లేక తీసుకోలేదా?

ఇండియన్‌ క్రికెటర్‌ కా దాదా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ జీవితం ఆధారంగా ఓ సినిమా వస్తోంది అని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అందులో హీరోగా నటించేది ఎవరూ అనే విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో వచ్చిన వార్తలకు అనుగుణంగా బాలీవుడ్ యువ హీరో ఇప్పుడు స్పందించడంతో హీరో ఎవరనే విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఆయనే ఆయుష్మాన్‌ ఖురానా. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుకే ఆయుష్మాన్‌ ఈసారి క్రికెటర్‌ అవ్వబోతున్నాడు.

అనతి కాలంలోనే స్టార్‌ బ్యాటర్‌గా మారిన గంగూలీ ఆ తర్వాత తన ఆల్‌రౌండర్‌ ప్రతిభతో వావ్‌ అనిపించాడు. ఆ వెంటనే కెప్టెన్‌ అయ్యి జట్టుకు దూకుడు నేర్పించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. ఇదంతా బయటకు కనిపించేదే. అయితే అందరికీ తెలియని చాలా విషయాలు ఆయన జీవితంలో ఉన్నాయి. అలాంటి అన్ని విషయాలను కూలంకషంగా సినిమా రూపంలో వివరించడానికి సన్నాహాలు చివరి దశకు వచ్చాయి.

‘డ్రీమ్‌ గర్ల్‌ 2’ విజయంతో మంచి ఉత్సాహం మీదున్న ఆయుష్మాన్‌… త్వరలో దాదా అవతారం ఎత్తబోతున్నాడు. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి సినిమా మొదలుపెడతాడని టాక్‌. క్రికెట్‌ కథాంశంగా తెరకెక్కే సినిమాలో నటించాలనేది ఎన్నాళ్లుగానో నా కోరిక. త్వరలోనే అది నెరవేరనుంది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మనలోని సత్తా ఏంటో నిరూపించుకోవచ్చు అంటూ ఇటీవల మీడియాతో అన్నాడు ఆయుష్మాన్‌. దీంతో అది గంగూలీ సినిమా గురించే అని ఇండస్ట్రీ టాక్‌.

గంగూలీ (Ganguly) సినిమాను మొదలెట్టడానికి ముందు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దాదా సమక్షంలోనే క్రికెట్ ట్రైనింగ్‌ తీసుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయట. అలాగే గంగూలీ ఇల్లు, బారిసా హౌస్, మోహన్ బగాన్ క్లబ్ వంటి ప్రదేశాల్లోనూ తిరిగి గంగూలీ గురించి చాలా విషయాలను తెలుసుకుంటాడట. అలాగే ఆ రోజుల్లో గంగూలీతో క్రికెట్‌ ఆడినవారిని కూడా కలుస్తాడట. ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించనున్నారని తొలుత వార్తలొచ్చాయి.

అంతకుముందు రాజ్‌ కుమార్‌ హిరానీ పేరు కూడా వినిపించింది. దీంతో విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను డిసెంబరులో ప్రారంభిస్తారని అంటున్నారు. అదేంటి టైటిల్‌లో క్రికెటర్‌ అన్నారు కదా అనుకుంటున్నారా? అవును ఆయుష్మాన్‌ క్రికెటరే. అండర్‌ – 19లో పంజాబ్‌లోని ఓ జిల్లా జట్టు తరఫున ఆడాడు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus