Guntur Kaaram: మహేష్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏం జరిగిందంటే?

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గుంటూరు కారం సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్స్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మహేష్ పుట్టినరోజు కానుకగా గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజవుతుందని ప్రచారం జరగగా ఫ్యాన్స్ మాత్రం పోస్టర్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మహేష్ అభిమానులకు నచ్చే విధంగా (Guntur Kaaram) గుంటూరు కారం సాంగ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కాగా త్రివిక్రమ్ సినిమాల విషయంలో థమన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారనే సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు క్రేజ్ పెరుగుతుండగా అల వైకుంఠపురములో సినిమాను మించేలా ఈ సినిమాలో సాంగ్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కాగా గుంటూరు కారం సినిమా ఈ కాంబో గత సినిమాలను మించి ఉండనుందని భోగట్టా..

మహేష్ త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో దాదాపుగా మూడేళ్ల గ్యాప్ తర్వాత రిలీజవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. హారిక హాసిని నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మహేష్ బాబు ఈ ఏడాది నవంబర్ సమయానికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. జక్కన్నను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా మహేష్ కు రాజమౌళి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus