‘ప్రభాస్ 20’ ఫస్ట్ లుక్ కు రంగం సిద్ధం..!

‘సాహో’ తర్వాత ప్రభాస్… ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. 30శాతం షూటింగ్ పూర్తయ్యింది అని దర్శకుడు తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఫస్ట్ లుక్ కూడా అతి త్వరలోనే ఇస్తామని చెప్పాడు. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ అలా చెప్పి.. రెండు నెలలు పైనే అయ్యింది.

ఇంకా ఎటువంటి ఫస్ట్ లుక్ విడుదల కాలేదు. కనీసం టైటిల్ కూడా తెలీదు. దీంతో ప్రభాస్ అభిమానులు ‘యూవీ క్రియేషన్స్’ వారి పై మండిపడుతూ ‘#banUVCreations’ అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. దాంతో త్వరలోనే ‘ప్రభాస్ 20’ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాము అని వారు చెప్పారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల రెండవ వారంలో ఈ చిత్రం టైటిల్ తో ఉన్న ఓ పోస్టర్ ను విడుదల చెయ్యాలి అని భావిస్తున్నారట.

షూటింగ్ లకు అనుమతులు వచ్చిన వెంటనే.. తిరిగి షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు అని తెలుస్తుంది. ఈ ఏడాది విదేశాలకు వెళ్ళి షూటింగ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి హైదరాబాద్ లోనే సెట్లు వేసి షూటింగ్ ఫినిష్ చెయ్యాలి అని భావిస్తున్నారని తెలుస్తుంది. పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఓ డియర్’ , ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus