Ram: రామ్ కు కాబోయే భార్య ఎవరంటే?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్ లిస్టులో చాలా మంది హీరోలే ఉన్నారు. వారిలో రామ్ పోతినేని ఒక‌రు. వ‌రుస క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న ఈ హీరో త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి అమ్మాయి ఎవ‌రు? అనే ఆస‌క్తి క‌ల‌గ‌టంలో సందేహం లేదు. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు రామ్ త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌నే పెళ్లిచేసుకోబోతున్నార‌ట‌. స్కూల్ డేస్ నుంచి రామ్‌కు ఓ అమ్మాయితో ప‌రిచ‌యం ఉంది.

ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ని.. ఇప్పుడు పెళ్లి వైపుగా ఇద్ద‌రు అడుగు లేస్తున్నార‌ని అంటున్నారు. పెళ్లి ఎప్పుడు? అని ఎవ‌రైనా రామ్‌ని అడిగితే మ‌న చేతుల్లో ఏముంటుంది.. కాల‌మే నిర్ణ‌యిస్తుంద‌ని చెబుతూ వ‌చ్చారు. కానీ ఆ పెళ్లి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింద‌ని ఇప్పుడు అంద‌రూ అనుకుంటున్నారు. ఇప్పుడు రామ్, అమ్మాయి ఇంటి పెద్ద‌లు క‌లిసి ఈ విష‌యంపై మాట్లాడుకుంటున్నార‌ని త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని టాక్‌.

అన్ని చ‌క్క‌గా కుదిరితే ఈ ఏడాదిలోనే రామ్ వివాహం ఉంటుంద‌నేది స‌మాచారం. ఇక రామ్ పోతినేని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి హైదరాబాద్ కి చెందిన అమ్మాయి అని వీరి ఫ్యామిలీ హైదరాబాదులోనే ఉంటుందని సమాచారం. ఇండియాలోనే టాప్ బిజినెస్ మాన్ కూతురు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే(Ram) రామ్ పోతునేని బోయపాటి సినిమా తర్వాత పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టే తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు అని కూడా కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.అయితే ఇదే నిజం అయితే రామ్ పోతినేని అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు అని ఈ విషయం నిజం అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus