Simhadri Movie: రాజమౌళి – జూనియర్ ఎన్టీఆర్‌ల ‘సింహాద్రి’ రీ రిలీజ్ ఎప్పుడంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొద్ది కాలంగా స్టార్ హీరోల పుట్టినరోజులు, సూపర్ హిట్ సినిమాల మైల్ స్టోన్ ఇయర్స్, ఇతర స్పెషల్ అకేషన్స్ సందర్భంగా ఆయా స్టార్స్ యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్.. లేటెస్ట్ అలాగే ఓల్డ్ ఫిలింస్‌కి 4K, డీటీఎస్ వంటి టెక్నాలజీ యాడ్ చేసి రీ రిలీజ్ అండ్ స్పెషల్ షోస్ వేయడం అనేది జరుగుతూ వస్తోంది.. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నటించిన పలు చిత్రాలు రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే..

ఇటీవల ‘ఆంధ్రావాలా’ రీ రిలీజ్ అంటూ పోస్టర్లు వదిలారు కానీ తర్వాత దాని ఊసే లేదు.. కట్ చేస్తే, ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల తర్వాత తారక్ సినిమా మరోటి రీ రిలీజ్ కాబోతోంది.. అదే.. ‘సింహాద్రి’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఫిలిం.. ‘సింహాద్రి’.. ‘స్టూడెంట్ నెం.1’ తర్వాత జక్కన్న డైరెక్ట్ చేసిన సెకండ్ ఫిలిం ఇది.. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు..

తెలుగు చలనచిత్ర చరిత్రలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది..20 ఏళ్ల వయసులో తారక్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ చూసి ఇండస్ట్రీతో పాటు బడా స్టార్స్ కూడా షాక్ అయ్యారు.. 50, 100, 150, 175 డేస్ రన్నింగ్‌తో రచ్చ రచ్చ చేశాడు ‘సింగమలై‘.. తారక్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్, కీరవాణి సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, జక్కన్న టేకింగ్, మేకింగ్ ‘సింహాద్రి’ ని సూపర్ డూపర్ హిట్ చేశాయి.. అభిమానుల కోరిక మేరకు ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయనున్నారు..

(Simhadri) ప్రస్తుతం 4K (అల్ట్రా HD), డాల్బీ అట్మాస్ 5.1తో రెడీ చేస్తున్నారు.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న, లేదా ఒకటి, రెండు రోజులు ముందుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ సాధించడం, కొరటాలతో తన 30వ సినిమా మొదలు పెట్టడంతో ఈ బర్త్‌డేని మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా స్టార్ట్ చేసేశారు..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus