Taapsee Marriage: తాప్సి పెళ్ళి డేట్ ఫిక్స్..ఎప్పుడో తెలుసా?

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది తాప్సి. ఆ చిత్రం కమర్షియల్ సక్సెస్ అందుకోవడంలో తాప్సి గ్లామర్ కృషి చాలానే ఉంది. అందుకే ఆ చిత్రం తర్వాత ఆమెకు వరుస సినిమాల్లో అవకాశాలు దక్కాయి.అయితే అందులో ఒక్క మిస్టర్ పర్ఫెక్ట్ తప్ప మరే సినిమా సక్సెస్ కాలేదు. ఆ టైములో అమ్మడికి తమిళ్ లోనూ మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ అక్కడ కూడా ఆశించిన బ్రేక్ రాలేదు.

చివరికి ఆమె సొంత గడ్డ అయిన బాలీవుడ్లోనే సక్సెస్ సాధించింది. అక్కడ హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో నటించి సక్సెస్ లు అందుకుంది. ఇప్పటికీ అమ్మడి చేతిలో క్రేజీ ఆఫర్స్ చాలానే ఉన్నాయి. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైములో అమ్మడు పెళ్ళి పీటలెక్కనుండడం తాజా సమాచారం. అవును తాప్సి పెళ్ళి ఫిక్స్ అయ్యిందని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ బోతో తాప్సీ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

ఆమె సోదరి షగున్ పన్ను ద్వారా మాథియాస్ బో… తాప్సీ కలుసుకోవడం.. తర్వాత వారి పరిచయం కాస్త ప్రేమగా మారడం.. ఇప్పుడు పెళ్ళి చేసుకునేంత వరకు ముదరడం జరిగింది. వీరి కుటుంబసభ్యులు కూడా వీరి పెళ్ళికి ఓకె చెప్పేసారు. డేట్ ఎప్పుడు అనే విషయం పై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరోపక్క చాలా కాలం తర్వాత `మిషన్ ఇంపాజిబుల్` అనే చిత్రంతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus