Trisha: బడా నిర్మాతను పట్టేసిన త్రిష.. తర్వలో పెళ్లి ?

సౌతిండియా ప్రేక్షకులకు త్రిష పరిచయం అక్కర్లేని పేరు. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ రెండు ఇండస్ట్రీలలోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. వర్షం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంది. దశాబ్ధాల పాటు కెరీర్ ను కొనసాగించిన వారిలో త్రిష ముందుంటారు. ఏజ్ పెరుగుతున్నా కొద్ది తన అందం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగింది.

సినిమాల పరంగా త్రిష ఎలా ఉంటుందో ఎఫైర్ల విషయంలోనూ తాను ముందు వరుసలోనే ఉంటుంది. తరచూ ఈమె పేర్లు వారితో వీరితో అంటూ వినిపిస్తూనే ఉంటాయి. టాలీవుడ్ లో దాదాపు అందరు అగ్రహీరోలతో నటించింది త్రిష. ఇన్నాళ్లయినా అమ్మడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని తన అభిమానులు ఎదురు చూస్తున్నారు. గతంలో ఓ తమిళ పారిశ్రామికవేత్త మణియన్ ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ పెళ్లిని రద్దు చేసుకుంది త్రిష.

అప్పటి నుంచి తను పెళ్లి ప్రస్తావన లేకుండా ఒంటరిగానే ఉంటోంది. మళ్లీ ఇంత కాలానికి త్రిష మనసులో పెళ్లి ఆశలు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్లో చక్కర్లు కొడుతున్న వార్తల సమాచారం ప్రకారం త్రిష కేరళలోని మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ఓ బడా నిర్మాతను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఆ విషయం కేవలం మాటల వరకే పరిమితమైందట.

ఇరు కుటుంబాలు సానుకూల ధోరణిలోనే ఉన్నాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రానాతో లివింగ్ లో ఉందన్న ప్రచారం జరిగింది. చూడాలి ఈ సారైన త్రిష పెళ్లి చేసుకుని బ్యాచ్ లర్ లైఫ్ కు చెక్ పెడుతుందేమో చూడాలి. ఏది ఏమైనా త్రిష పెళ్లి వార్త తన అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉందిది. అందాల తార త్రిష (Trisha) విజయ దళపతి నటిస్తున్న లియో సినిమాలో నటిస్తోంది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus