Virupaksha: కానీ..హీరో సాయి ధరమ్ తేజ్ కాదంట..!

ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద బయ్యర్స్ కి మరియు నిర్మాతలకు కాసుల కనకవర్షం కురిపించిన చిత్రాలలో ఒకటి ‘విరూపాక్ష’. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ రికవరీ తర్వాత చేసిన మొట్టమొదటి సినిమా ఇది. ఇప్పటి వరకు హారర్ జానర్ లో ఎన్ని సినిమాలు అయినా వచ్చి ఉండొచ్చు, కానీ ‘విరూపాక్ష ‘ చిత్రం మాత్రం సరికొత్త పాయింట్ తో వచ్చిన హారర్ జానర్ చిత్రం.

ప్రారంభం నుండి ఎండింగ్ వరకు తర్వాత ఏమి జరగబోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఈ సినిమా. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కార్తీక్ దండు అంటే అతను ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలిసినిమాతోనే ప్రేక్షకులను ఈ రేంజ్ లో దడ పుట్టిస్తాడని సుకుమార్ కూడా ఊహించి ఉండదు. అందుకే ఈ సినిమా కమర్షియల్ గా వండర్స్ ని సృష్టించింది.

ఇకపోతే క్లైమాక్స్ లో (Virupaksha) ‘విరూపాక్ష’ కి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ ఒక చిన్న హింట్ ఇస్తాడు. ఈ సీక్వెల్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది ఇంకా ఖరారు కాలేదు కానీ, ఈ సీక్వెల్ సాయి ధరమ్ తేజ్ తో చెయ్యడం లేదని మాత్రం అర్థం అవుతుంది. డైరెక్టర్ కార్తీక్ అక్కినేని అఖిల్ ని ఈ సీక్వెల్ లో నటింపచేయాలని చూస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన అఖిల్ ని కలిసి కథ మొత్తం వివరించాడట.

అఖిల్ కూడా కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 8 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక సతమతం అవుతున్న అఖిల్ కి ఇప్పుడు అర్జెంటు గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. కాబట్టి ఈ స్క్రిప్ట్ ఆయనకీ పక్కగా సరిపోతుందని అనుకుంటున్నాడు. వచ్చే ఏడాది నుండి షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus