ఈ లాక్ డౌన్ టైములో ఓటిటి స్టార్ అనిపించుకున్నాడు సత్యదేవ్. అతను రెండు సినిమాలతో ఈ లాక్ డౌన్ లో సందడి చేసాడు. ఒకటి ’47 డేస్’ మరొకటి ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఇందులో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం హిట్ గా నిలిచింది. చాలా కాలం నుండీ… సోలో హీరోగా మంచి హిట్ కొట్టాలని ఎదురుచూస్తూ వచ్చిన సత్యదేవ్ కు ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం రూపంలో ఆ హిట్టు ఓటిటిలో దొరికింది.
ఇప్పుడు సత్యదేవ్ బాటలో మన అల్లరి నరేష్ కూడా అడుగులు వేస్తున్నట్టు తాజా సమాచారం. వివరాల్లోకి వెళితే అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీస్.. ‘బంగారు బుల్లోడు’ మరియు ‘నాంది’ చిత్రాలు ఓటిటిలోనే విడుదల కాబోతున్నాయట. నిజానికి అక్టోబర్ 15నుండీ థియేటర్లు తెరుచుకుంటున్నప్పటికీ.. అల్లరి నరేష్ సినిమాలు ఓటిటిలో విడుదలవ్వడం ఏంటి? అని చాలా మంది చర్చించుకుంటున్నారు. అయితే థియేటర్లు తెరుచుకుంటున్నప్పటికీ ప్రేక్షకులు ఎక్కువమంది తరలి వస్తారన్న గ్యారెంటీ లేదు.
పైగా ఈ చిత్రాలకు అమెజాన్ నుండీ వస్తున్న రేటే ఎక్కువని తెలుస్తుంది. ‘బంగారు బుల్లోడు’ చిత్రానికి 8 కోట్లు అలాగే ‘నాంది’ చిత్రానికి 8కోట్ల వరకూ ఆఫర్ వచ్చిందట. దాంతో నిర్మాతలు ఓటిటి వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది.