Allari Naresh: ‘ఉగ్రం’ కోసం నరేశ్‌ అంత కష్టపడ్డారా? మరీ ఇంత డెడికేషనా?

సినిమా కోపం ఎంతైనా కష్టపడతాం అని చెబుతుంటారు. ఒక్కోసారి ఈ క్రమంలో అనారోగ్యం కూడా పాలవుతుంటారు. అయితే ఆ సినిమా విజయం అందుకున్నాక.. ఆ ఆనందం ముందు ఆ కష్టం ఏ మాత్రం గుర్తుండదు అంటుంటారు. ఇప్పుడు అంతటి కష్టం పడి.. ఆనందం కోసం వెయిట్‌ చేస్తున్న హీరోల్లో అల్లరి నరేశ్‌ ఒకరు. ‘ఉగ్రం’ పేరుతో ఆయన చేసిన ఓ సినిమా కోసం ఏకంగా రోజుకు 100 సిగరెట్లకుపైగా వరకు తాగారట. పాత్ర కోసం అలా చేయాల్సి వచ్చిందని కూడా చెప్పారు.

కామెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. సీరియస్‌ రోల్స్‌లో ది బెస్ట్‌ అయిన ‘గాలి శీను’ చేసిన నటుడు అల్లరి నరేశ్‌. ఆయన తాజాగా అలాంటి సీరియస్‌ పాత్ర చేసిన సినిమా ‘ఉగ్రం’. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఆరోగ్యం పాడ‌య్యిందట. ద‌గ్గుతో చాఆల బాధ‌ప‌డ్డారట. విప‌రీతంగా సిగ‌రెట్స్ కాల్చ‌ట‌మే అందుకు కార‌ణమట. సాధార‌ణంగానే సిగ‌రెట్స్ తాగితే ఆరోగ్యం పాడ‌వుతుంది. అలాంటిది నాలుగు రోజుల్లో 500 సిగ‌రెట్స్ తాగితే… అదే చేశాడు నరేశ్‌.

సినిమా షూటింగ్‌ కోసం న‌రేష్ 4 రోజుల్లో 500 సిగ‌రెట్స్ తాగార‌ట‌. అంటే రోజుకి వంద‌కి పైగా సిగ‌రెట్స్ అన్నమాట. ‘ఉగ్రం’ సినిమాలో ఓ యాక్ష‌న్ సీన్‌ కోసమే ఈ సిగరెట్స్‌ తాగారట నరేశ్. నైట్ టైమ్‌లో షూట్‌ చేసిన ఆ ఫైట్‌లో న‌రేష్ సిగ‌రెట్ కాలుస్తూ కనిపించాలట. అయితే ఈ ఫైట్‌ను నాలుగు రోజులు చిత్రీక‌రించారట. దీంతో ఆ నాలుగు రోజులూ ఆయ‌న సిగ‌రెట్స్ కాలుస్తూ న‌టించారట. అలా ఫైట్ పూర్త‌య్యేలోపు దాదాపు 500 సిగ‌రెట్స్ తాగేశార‌ట న‌రేష్.

దీంతో ఆ తర్వాత రోజు నుండి (Allari Naresh) నరేశ్‌ ద‌గ్గుతో బాధ‌ప‌డుతూనే షూటింగ్‌లో పాల్గొనాల్సి వ‌చ్చింద‌ట. ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్‌కు జోడీగా మిర్నా న‌టించింది. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 28న వస్తోంది. గతంలో నరేశ్‌ – విజయ్‌ కాంబోలో వచ్చిన ‘నాంది’ మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus