అనుకున్నదొకటి అయినదొకటి.. అంటారు కొంతమంది.. మంచి జరిగినప్పుడు ఏది జరిగిన మన మంచికే అనుకోవాలి.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `మహర్షి` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్, జగపతి బాబు, జయసుధ, ప్రకాశ్ రాజ్ తదితరులు ఇందులో కీలక పాత్రను పోషించాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్లపై నిర్మితమైన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు.
2019లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే అల్లరి నరేష్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రంగా నిలిచింది. అప్పటి వరకు కామెడీ చిత్రాలకే పరిమింతం అయిన అల్లరి నరేష్.. `మహర్షి`సినిమా ద్వారా తనలోనే మరొక నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇందులో మహేష్ బాబు ఫ్రెండ్ రవిగా హెవీ ఎమోషన్స్ ఉన్న పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించాడు. స్నేహం కోసం మరియు తనని నమ్ముకున్న వారి కోసం కెరీర్ ని మరియు ప్రాణాలను కూడా లెక్కచెయ్యని వ్యక్తిగా జీవించేసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
కామెడీ చిత్రాలతో అప్పటి వరకు నవ్వించిన అల్లరి నరేష్ (Naresh) ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టారు. ఈ మూవీ అనంతరం ఆయన కామెడీ కథలను పక్కన పెట్టి సీరియస్ కథలతో కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మహర్షిలో రవి పాత్రకు అల్లరి నరేష్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ పాత్రను మొదట ఓ మెగా హీరో వద్దకు వంశీ పైడిపల్లి తీసుకెళ్లగా.. ఆయన రిజెక్ట్ చేశాడట.
ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు సాయి ధరమ్ తేజ్. అప్పటికే తేజ్ అర డజన్ ఫ్లాప్స్ తో కెరీర్ ని రిస్క్ లో పడేసుకున్నాడు. అలాంటి సమయం లో ఈ పాత్ర చెయ్యడం వల్ల తేజ్ కి ఎంతో మైలేజ్ వస్తుంది అని వంశీ పైడిపల్లి భావించాడట. ఈ క్రమంలోనే మహర్షి కోసం తేజ్ ను సంప్రదించాడట. కానీ, పలు కారణాల వల్ల తేజ్ రవి పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత మమర్షిలో అల్లరోడు ఎంటర్ అయ్యాడు. అదన్నమాట సంగతి.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?