టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వరుసగా సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే మరోవైపు యాడ్స్ లో వరుసగా నటిస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు. తాజాగా బన్నీ స్వెట్ షర్ట్ లో దర్శనమివ్వగా ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ స్వెట్ షర్ట్ ఖరీదు ఏకంగా 28,000 రూపాయలు అని తెలుస్తోంది. బుర్బెరీ మోనోగ్రామ్ అప్లిక్ కాటన్ స్వెట్ షర్ట్ ను ధరించిన బన్నీ మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
పుష్ప ది రైజ్ సినిమాతో నార్త్ లో కూడా అంచనాలను మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప ది రూల్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పుష్ప3 కూడా ఉండొచ్చంటూ బన్నీ పుష్ప ఫ్రాంఛైజ్ పై అంచనాలను పెంచేశారు. సుకుమార్ తర్వాత ప్రాజెక్ట్ ల గురించి స్పష్టత లేదు. బన్నీ సుకుమార్ కాంబో బ్లాక్ బస్టర్ కాంబో అనే సంగతి తెలిసిందే.
పుష్ప2 సినిమాకు వచ్చే రెస్పాన్స్ ను బట్టి పుష్ప3 గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని చెప్పవచ్చు. పుష్ప2 సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. బన్నీ విభిన్నమైన కాన్సెప్ట్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తన సక్సెస్ రేట్ అంతకంతకూ పెరిగేలా బన్నీ (Allu Ajrun) జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.
పుష్ప ది రూల్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండనుందని సమాచారం అందుతుంది. పుష్ప ది రూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ సినిమా నుంచి ఏవైనా అప్ డేట్స్ వస్తే బాగుంటుందని అభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. బన్నీ పుష్పరాజ్ లుక్ మేకప్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. మైత్రీ నిర్మాతలు ఈ సినిమా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదు.