Chiranjeevi, Allu Arjun: మెగాస్టార్ అంటే బన్నీకి అంతప్రేమా ..?

మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందని చాలా రోజులుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. అందుకే మెగా ఫ్యామిలీలో జరుగుతున్న ఈవెంట్స్ కి అల్లు ఫ్యామిలీ దూరంగా ఉంటుందని.. బన్నీ అయితే మెగా ట్యాగ్ ను అసలు ఇష్టపడడం లేదని.. తనే సొంతంగా ఓ బ్రాండ్ లా ఎదగాలని భావిస్తున్నట్లు కథనాలను ప్రచురించారు. ఈ ప్రచారంపై అల్లు అరవింద్ పరోక్షంగా స్పందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో అల్లు అరవింద్.. బన్నీకి చిరు మీదున్న ప్రేమ గురించి వివరించారు. బన్నీ అంటే చిరంజీవికి ఎంత ఇష్టమో కూడా వివరించారు. చిరంజీవికి బన్నీ అంటే కొడుకుతో సమానమని.. బన్నీ ఏం చేసినా కూడా చిరంజీవి ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు బన్నీ, చరణ్ కలిసి డాన్స్ లు చేసినవి.. అందులో బన్నీని చిరు ఎంకరేజ్ చేయడం ఇలా ఎన్నో వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయని అల్లు అరవింద్ తెలిపారు.

బన్నీకి అయితే చిరు అంటే చాలా ఇష్టమని చెప్పారు. ‘అల వైకుంఠపురములో’ ఈవెంట్ లో బన్నీ ‘ఈ కట్టె కాలేవరకు చిరంజీవి అభిమానినే’ అనే మాట చెప్పాడని.. అది విన్నప్పుడు చిరంజీవి అంటే ఇంత అభిమానమా..? అని నాకే అనిపించిందని అన్నారు. చిరంజీవి గారు వేరే లెవెల్.. ఆయన స్థాయి అది అంటూ ఇంట్లో కూడా ఎప్పుడూ చిరంజీవి గురించి బన్నీ చెబుతూనే ఉంటాడని గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. కొద్ది రోజుల్లో ‘పుష్ప2’ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు బన్నీ. సుకుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus