Allu Aravind, chiranjeevi: చిరంజీవి అంత పెద్ద రహదారి వేశారు.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మాతగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చరణ్ (Ram Charan) బన్నీ (Allu Arjun) కాంబోలో చరణ్ అర్జున్ టైటిల్ తో అల్లు అరవింద్ ఒక సినిమాను ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు సినిమాల్లోకి రావడానికి సినిమాల్లో ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చిరంజీవి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హైదరాబాద్ లో జరిగిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ పవన్ (Pawan Kalyan) నుంచి అల్లు శిరీష్ (Allu Sirish) వరకు అందరూ చిరంజీవి వేసిన బాటలో నడుస్తూ సినీ కెరీర్ ను నిర్మించుకున్నారని ఆయన తెలిపారు. అంత పెద్ద రహదారి వేశారాయన అంటూ అల్లు అరవింద్ కామెంట్లు చేశారు. ఎంతోమంది యువ నటీనటులకు చిరంజీవి స్పూర్తిగా నిలిచారని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమానికి చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా విచ్చేయగా మెగాస్టార్ కు పద్మ విభూషణ్ వచ్చినందుకు సినీ ప్రముఖులు ఆయనను ఘనంగా సత్కరించారు. అల్లు అరవింద్ చేసిన కామెంట్లు మెగా ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

చిరంజీవి అల్లు అరవింద్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. అల్లు అరవింద్ నిర్మాతగా రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి మాత్రం వరుస విజయాలు సాధించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. చిరంజీవి ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. చిరంజీవి సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విశ్వంభర మూవీ రిలీజ్ కానుంది.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus