ప్రముఖ సినీ నిర్మాత తాజాగా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయన తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం మారడం పట్ల సినీ ప్రముఖులలో కూడా పలు చర్చలు మొదలయ్యాయి. పార్టీ మారడంతో సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఎవరు ఉంటారనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వమైనా సినీ పరిశ్రమకు ఏదైనా సహాయం చేస్తారా ఇకపై నంది అవార్డులను ప్రకటిస్తారా అంటూ ఇలా ఎన్నో రకాలుగా చర్చలు జరుపుతున్నారు.
ఈ క్రమంలోనే నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడం పట్ల ఈయన హర్షం వ్యక్తం చేశారు. సినీ ప్రభుత్వాన్ని ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త ఏమీ కాదని అల్లు అరవింద్ తెలిపారు. ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చిత్ర పరిశ్రమను ఎన్నో విధాలుగా ఆదుకున్నాయని అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుందని ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ముందుగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈయన శుభాకాంక్షలు తెలియజేశారు ఇక త్వరలోనే తాను సినీ పెద్దలతో కలిసి చిత్ర పరిశ్రమ తరపున కాంగ్రెస్ నేతలను కలుస్తానని తెలిపారు. ఇక చిత్ర పరిశ్రమకు రెండు రాష్ట్రాల మద్దతు ఉండాలని రాష్ట్రాల మద్దతు ఉంటేనే చిత్ర పరిశ్రమ కూడా ముందుకు కొనసాగుతుందని
ఇదివరకు ఎంతో మందిని పెద్దలు నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చిత్ర పరిశ్రమకు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!