Allu Aravind: ఆ అవార్డ్స్ ఫంక్షన్ ఫెయిల్ అయ్యింది.. దాంతో ఇండస్ట్రీకి సంబంధం లేదు : అల్లు అరవింద్

అతనొక సీనియర్ జర్నలిస్ట్. మెగాస్టార్ చిరంజీవి వద్ద కొన్నాళ్ళు పీఆర్ గా చేశారు కూడా..! ఎంతలా అంటే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమాకి కూడా టైటిల్ పెట్టేంతలా..! కానీ ఏమైందో ఏంటో తెలీదు.. ఇతను ఇప్పుడు మెగా హీరోలకి పీఆర్ గా చేయడం లేదు. వాళ్ళే దూరం పెట్టారా? లేక ఇతనే దూరంగా ఉంటున్నాడా అనేది తెలీదు. అయితే ఇప్పటికీ చిరంజీవి, అల్లు అరవింద్ వంటి వారితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు. మరోపక్క ప్రతి సినిమా ఈవెంట్లకి వెళ్లి చిత్ర, విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటాడు.

ఇతను కనుక అందుబాటులో లేకపోతే దర్శక నిర్మాతలు ‘క్యూ అండ్ ఎ’ సెషన్లు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అంతలా ఇతను పాపులర్ అయ్యాడు. అయితే చాలా కాలంగా ఇతను తన సంస్థ పేరు పై అవార్డు ఫంక్షన్లు నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది అయితే దానిని గోవాలో పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేశాడు. ఎందుకో ఈసారి అది సక్సెస్ కాలేదు. అదీకాక ఈ అవార్డు వెనుకకు హాజరైన కన్నడ నటీనటులు.. ఆ సీనియర్ జర్నలిస్ట్ ను తిట్టిపోస్తున్నారు.

ఎందుకంటే కన్నడ నటీనటులకు ఎక్కువ అవార్డులు రాలేదట. అదీ కాక.. వారు అవార్డులు తీసుకుంటున్న టైంలో లైట్లు కూడా ఆపేసి.. వారిని కిందికి దిగిపోమని అవమానించారట. మరోపక్క .. వారు హోటల్ రూమ్స్ కి సంబంధించిన బిల్స్ కూడా పే చేయకుండా వారిని ఖాళీ చేయించినట్టు కూడా వారు చెప్పుకొస్తున్నారు. దీంతో కొంతమంది కన్నడ నెటిజన్లు.. మెగా ఫ్యామిలీ పీఆర్ఓ ఇలా చేస్తాడు అనుకోలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది మెగా నిర్మాత అల్లు అరవింద్ ను హర్ట్ అయ్యేలా చేసింది.

దీంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. ” అతను మెగా ఫ్యామిలీలో ఏ హీరోకి పీఆర్ గా చేయడం లేదు. మాతో దిగిన ఫోటోలు,కొన్ని ఈవెంట్లలో కలిసిన సందర్భంలోనివి. వాటిని పెట్టుకుని మెగా ఫ్యామిలీపై, తెలుగు సినీ పరిశ్రమపై నెగిటివ్ కామెంట్లు చేయడం సరికాదు. ఆ అవార్డు వేడుకతో సినీ పరిశ్రమకి సంబంధం లేదు. అతను ఏదో గొప్పగా చేయాలనుకున్నాడు. కానీ ఫెయిల్ అయ్యాడు. ఇది అతని ఫెయిల్యూర్ మాత్రమే” అంటూ అల్లు అరవింద్ (Allu Aravind) చెప్పుకొచ్చారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus