తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శాకుంతలం సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించారనే సంగతి తెలిసిందే. ఈ ప్రీమియర్ షోలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో టాక్ పాజిటివ్ గా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో టాక్ నెగిటివ్ గా ఉంది. అయితే అల్లు అర్హ ఈ సినిమాలో భరతుని రోల్ ను పోషించగా అర్హ పాత్ర ఈ సినిమాకు హైలెట్ కానుందని సమాచారం అందుతోంది. అర్హ పాత్ర పరిమితం అయినా సినిమాకు ఆ రోల్ హైలెట్ కానుందని తెలుస్తోంది.
అర్హ క్లైమాక్స్ లో కొన్ని సన్నివేశాల్లోనే కనిపించినా ఆ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. అల్లు అర్హ గ్రాంథికంలో చెప్పే డైలాగ్స్ సూపర్ గా ఉంటాయని తెలుస్తోంది. పెద్ద పెద్ద డైలాగ్ లను ఎలాంటి తప్పులు లేకుండా అర్హ చెప్పే విధానానికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఫిదా కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు. బన్నీ, స్నేహ గ్రేట్ అని అర్హ ను చక్కగా పెంచారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ అర్హకు (Allu Arha) దక్కుతుందని కొంతమంది చెబుతున్నారు. బన్నీ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ లా ఉంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. శాకుంతలం రిలీజ్ తర్వాత అల్లు అర్హకు ఆఫర్లు మరింత పెరగడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్హ ఈ సినిమాలో రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అలవోకగా అల్లు అర్హ డైలాగ్స్ చెబుతుండటంతో షాకవ్వడం ఫ్యాన్స్ వంతవుతోంది. అల్లు అర్హ టాలెంటెడ్ అని ఆ చిన్నారి టాలెంట్ మామూలు టాలెంట్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్హ బన్నీ, స్నేహారెడ్డి పేరు నిలబెట్టారని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాతో అల్లు అర్హను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!