Allu Arjun: ఫ్యాన్స్‌ను సైన్యంతో పోల్చిన బన్నీ… ఏమన్నా ఎలివేషనా ఇది!

అభిమానుల్ని ఎంత ప్రేమిస్తే… వాళ్లు అంతగా ప్రేమిస్తారు అని చెబుతుంటారు. అందుకే మన హీరోలు ఎప్పటికప్పుడు అభిమానుల్ని ఆకాశానికెత్తేస్తుంటారు. ఒకప్పుడు సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్లు, ఇప్పుడు ప్రీరిలీజ్‌ ఈవెంట్లలో ఇదే జరుగుతోంది. అప్పుడప్పుడు ఇతర ఈవెంట్లలోనూ ఇదే కనిపిస్తోంది. తాజాగా ‘ఆహా 2.0’ వేడుక కూడా దీనికి వేదిక అయ్యింది. అల్లు అర్జున తన అభిమానులకు ఓ రేంజి ఎలివేషన్‌ ఇచ్చాడు. వేడుకల్లో అభిమాన హీరో వస్తే… మొత్తం అతనికి సంబంధించిన హడావుడే ఉంటుంది. మనం చాలా ఫంక్షన్లలో చూశాం కూడా. తాజాగా ‘ఆహా 2.0’ వేడుకలో కూడా ఇదే జరిగింది.

తన గురించి కేరింతల కొడుతున్న అభిమానులను చూసి ఎప్పటిలాగే ‘మీరు లేకపోతే అసలు నేనే లేను’ అంటూ స్పందించాడు అల్లు అర్జున్‌. అంతేకాదు మిమ్మల్ని ‘‘అభిమానులు అనాలా..? లేక ఆర్మీ అనాలా..?’’ అంటూ అడిగాడు. ఆ తర్వాత తనే అభిమానుల్ని ఉద్దేశించి ‘ఆర్మీ’ అని ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమా గురించి కూడా అల్లు అర్జున్‌ కూడా మాట్లాడాడు. రిలీజ్ అవ్వకముందు చాలా తక్కువ సినిమాలకే పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ‘పుష్ప’ కి అలాంటి పాజిటివ్ ఫీలింగ్‌ ఉంది. ఈ సినిమాలో సుకుమార్ బ్రిలియన్స్ చూస్తారు. సినిమా నుంచి మరో పాట త్వరలో రాబోతోంది.

అది ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు బన్నీ. అంతేకాదు డిసెంబర్ 17న సినిమా రిలీజ్ అవ్వడం పక్కా అని కూడా చెప్పారు అల్లు అర్జున్‌. ఒక సక్సెస్ ఫుల్ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా ‘ఆహా’ ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. దీనికి కారణమైన తన తండ్రికి కంగ్రాట్స్ చెప్పారు. డెబ్భై ఏళ్ల వయసులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసి హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదని.. యువర్ ది ఎనర్జీ ఆఫ్ ‘ఆహా’ అంటూ తన తండ్రిపై ప్రేమను కురిపించాడు. ఇప్పటినుంచి ‘ఆహా’ వేరే లెవెల్ అని అన్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus