మెగా ఫ్యామిలీలో ఏదో అయిపోతోంది, ఏదో జరిగిపోతోంది.. కుటుంబంలో గ్యాప్స్ ఉన్నాయి. ఒకరి గురించి, ఒకరు బయట వేదికల మీద మాట్లాడుకోరు అని అంటుంటారు. ఇది నిజం కాదని మెగా కుటుంబం హీరోలు పదే పదే వివిధ రకాలుగా చెప్పినా పట్టించోరు. ఇప్పుడు తన వెనుక ఉన్నది ఎవరు అనే విషయాన్ని మరోసారి క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్ (Allu Arjun). తన ఇన్‌స్పిరేషన్ చిరంజీవి (Chiranjeevi) అని చెప్పాడు. ఇందులో కొత్తేముంది ఎప్పుడూ చెప్పేదేగా అనొచ్చు.. ఇప్పుడు చెప్పిన వేదిక ఇక్కడ అసలు మేటర్.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025) గురువారం ప్రారంభమైంది. ముంబయి వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో భారతీయ సినిమాకు చెందిన ప్రముఖులు చాలామంది పాల్గొననునర్నారు. తొలి రోజు చిరంజీవి, రజనీకాంత్ (Rajinikanth), నాగార్జున (Nagarjuna), మోహన్ లాల్ (Mohanlal), ఆమిర్ ఖాన్ (Aamir Khan), అక్షయ్ కుమార్ (Akshay Kumar), అల్లు అర్జున్ వచ్చారు. ఈ క్రమంలోనే బన్నీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నేనొక రీజనల్ యాక్టర్‌ని. తెలుగు సినిమాల్లో వర్క్ చేస్తున్నాను. మిగతా ఫిలిం ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మా పాపులారిటీ తక్కువగా ఉండేది. కానీ ‘పుష్ప’ (Pushpa) సినిమాతో భారతీయ ప్రేక్షకులకు దగ్గరయ్యాను ఇప్పుడు నేను అందరికీ తెలుసు అని చెప్పుకొచ్చాడు. అయితే గత కొన్ని రోజులుగా సౌత్ సినిమాలో జరుగుతున్న సిక్స్ ప్యాక్ చర్చను వేవ్స్ వేదిక మీదకు తీసుకొచ్చాడు బన్నీ. దక్షిణాది హీరోల్లో సిక్స్ ప్యాక్ చేసిన ఫస్ట్ హీరో తానేనని చెప్పుకొచ్చాడు. 20 ఏళ్ల క్రితమే అప్పటి వరకూ ఏ సౌత్ హీరో చేయనిది చేయాలని అనుకున్నాను. అలా సిక్స్ ప్యాక్ చేశాను అని తెలిపాడు. ‘దేశముదురు’ బన్నీ సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తాడు.
చిన్నప్పటి నుండి తనకు డాన్స్ అంటే ఇష్టమని, డ్యాన్స్ నేర్చుకోడానికి ట్రైనింగ్ తీసుకోలేదని చెప్పాడు. తానొక నేచురల్ డ్యాన్సర్‌ని అని కూడా చెప్పాడు. అలాగే నన్ను ఇన్‌స్పైర్ చేసినవాళ్లలో నా మామ మెగాస్టార్ చిరంజీవి ఒకరని చెప్పుకొచ్చాడు. తన మీద ఆయన ఇంపాక్ట్ ఎంతో ఉందని కూడా చెప్పాడు. అంతా బాగుంది కానీ.. అనవసరంగా సిక్స్ ప్యాక్ కామెంట్లు ఎందుకు అనేది ఇక్కడ పాయింట్. సూర్య తండ్రి శివ కుమార్ ఇటీవల చేసిన సిక్స్ ప్యాక్ కామెంట్లు ఇంకా చర్చ పెడుతూనే ఉన్నాయి.