Allu Arjun: నర్సింగ్‌ విద్యార్థిని దత్తత తీసుకున్న అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ను కేరళలో మల్లు అర్జున్‌ అంటారు. అంతగా తనను తమలో కలిపేసుకున్నారు కేరళ వాసులు. మరోవైపు అల్లు అర్జున్‌ కూడా ఆ ప్రాంతమంటే, అక్కడ ప్రజలంటే ఎంత ఇష్టమో చూపిస్తూ ఉంటారు. దాంతోపాటు కష్టం అని ఎవరైనా తన దగ్గరకు వచ్చినా, ఒకరు కష్టంలో ఉన్నారని తెలిసినా సాయం చేస్తుంటారు. తాజాగా కేరళకు చెందిన ఓ నర్సింగ్‌ విద్యార్థిని అల్లు అర్జున్‌ దత్తత తీసుకున్నారట. ఈ విషయాన్ని అలెప్పీ జిల్లా కలెక్టర్‌ మైలవరపు కృష్ణతేజ చెప్పారు. అలెప్పీలో ఓ నర్సింగ్ విద్యార్థిని చదువుకు అవసరమయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానంటూ బన్నీ హామీ ఇచ్చారట. We Are for Alleppey అనే ప్రాజెక్ట్ లో భాగంగా బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నాడట.

కేరళలో 2018లో భారీగా వరదలు వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పున్నమనాడ బ్యాక్ వాటర్స్‌ ప్రాంతంలో ఉండే.. అలెప్పీ మొత్తంగా కకావికలమైంది. దీంతో అప్పటి అలెప్పీ సబ్ కలెక్టర్, ప్రస్తుత జిల్లా కలెక్టర్ అయిన మైలవరపు కృష్ణతేజ ‘ఐయామ్ ఫర్ అలెప్పీ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, సుమ, రాజమౌళి బాహుబలి బృందం… ఇలా చాలా మంది తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సహాయం అందించారు.

దానికి కొనసాగింపుగా కొవిడ్‌తో మరణించిన తల్లితండ్రుల పిల్లలను ఆదుకునేందుకు వీ ఆర్‌ అలెప్పీ అనే కార్యక్రమాన్ని కృష్ణతేజ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ విద్యార్థినిని నర్సింగ్ చదువు నిమిత్తం ఆర్థిక సహాయం కావాల్సి ఉంది. ఆ విద్యార్థినికి మెరిట్ ర్యాంకు వచ్చినా ఫీజులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ కృష్ణతేజ ఆమెకు సహాయం అందించాలని భావించారు. దీంతో అల్లు అర్జున్ సహాయాన్ని కృష్ణతేజ కోరారు.

మేనేజ్ మెంట్ కోటాలో సెయింట్‌ థమస్‌ నర్సింగ్‌ కాలేజీలో నర్సింగ్ సీటు సంపాదిస్తామని, దాని కోసం ఏడాది ఫీజు చెల్లిస్తే బాగుంటుందని బన్నీని కలెక్టర్‌ కోరారట. అయితే అల్లు అర్జున్‌ ఏకంగా నాలుగేళ్లూ నేనే ఫీజులు భరిస్తాను అని చెప్పారట. నాలుగేళ్లలో దీని కోసం దాదాపు రూ.10 లక్షలు అవుతుందట. ఈ విషయాన్ని అలెప్పీ కలెక్టర్ కృష్ణతేజ తెలిపారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus