బన్నీ సుకుమార్ పుష్ప సినిమాను రెండు భాగాలుగా తీయాలని ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై బన్నీ ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుకుమార్ సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ లేకపోతే ఫ్లాప్ అవుతాయి. రంగస్థలం సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించిన సుకుమార్ పుష్ప సినిమాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటే డైరెక్టర్ గా సుకుమార్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు 230 కోట్ల రూపాయల నుంచి 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో పుష్ప రెండు భాగాలు తెరకెక్కనుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ రెండు భాగాల బిజినెస్ 500 కోట్ల రూపాయలు జరగవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
బన్నీ సుకుమార్ పుష్ప రెండు పార్టులతో బిజినెస్ కు తగిన స్థాయిలో కలెక్షన్లను సాధించాల్సి ఉంది. ఈ ఏడాది పుష్ప పార్ట్ 1 రిలీజ్ చేసి వచ్చే ఏడాది పుష్ప పార్ట్ 2 రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ పుష్ప రెండు పార్టులకు దాదాపు 90 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని భోగట్టా. అయితే తొలిభాగం ఫలితాన్ని బట్టే రెండో భాగం బిజినెస్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.
మరోవైపు సుకుమార్ సినీ కెరీర్ లో జగడం, ఆర్య 2, 1 నేనొక్కడినే ఫ్లాపులు ఉన్నాయి. సుకుమార్ ఇప్పటివరకు హ్యాటిక్ హిట్స్ అందుకోలేదు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలతో రెండు హిట్లను అందుకున్న సుకుమార్ పుష్పతో హ్యాట్రిక్ సాధించి దర్శకుడిగా వరుస విజయాలను సాధిస్తానని ప్రూవ్ చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాలో రష్మికతో పాటు మరో స్టార్ హీరోయిన్ నటించబోతున్నారని తెలుస్తోంది