Allu Arjun: అల్లు అర్జున్ నెక్స్ట్.. మొదలైన త్రివిక్రమ్ వర్క్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో కొత్త సినిమా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2తో మంచి క్రేజ్ అందుకున్న బన్నీకి తదుపరి సినిమా మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది. భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు ప్రారంభమయ్యాయి. రామాయణం నేపథ్యంలో సాగే కథతో, హిస్టారికల్ టచ్ ఉండే ఈ చిత్రానికి విభిన్నమైన కాన్సెప్ట్‌ను త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారని సమాచారం.

Allu Arjun

ఈ ప్రాజెక్ట్ కోసం కీలక టెక్నీషియన్ల ఎంపికపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్, అలాగే VFX వంటి విభాగాల కోసం పేరుప్రఖ్యాతి గల టెక్నీషియన్లను తీసుకోవాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. సినిమాటోగ్రాఫర్ విషయంలో ప్రస్తుతం వినోద్ స్థానంలో కొత్త వ్యక్తిని అన్వేషిస్తున్నారు.

ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో పెద్ద చర్చే జరుగుతోంది. “అల వైకుంఠపురములో”తో సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన తమన్‌ చాలా కాలంగా త్రివిక్రమ్ కాంపౌండ్ దాటి బయటకు రావడం లేదు. ఇక అతనికి బదులుగా త్రివిక్రమ్ అనిరుధ్‌ను తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. గతంలో అజ్ఞాతవాసి సినిమాకు కలిసి వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆర్ట్ డైరెక్షన్ పక్షంలో, ఎప్పటిలాగే ప్రకాష్ పేరే ముందున్నా, ఈసారి పాన్ ఇండియా స్థాయికి తగ్గ అనుభవం ఉన్న ఆర్ట్ డైరెక్టర్ కోసం వెతుకుతున్నట్టు తెలుస్తోంది.

అలాగే VFX చీఫ్ టెక్నీషియన్ ఎంపికపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. త్రివిక్రమ్ రైటింగ్ పూర్తి చేసిన తర్వాత, టెక్నీషియన్లతో కలసి స్టోరీ బోర్డ్, లొకేషన్స్, సెట్ డిజైనింగ్, యాక్షన్ సీక్వెన్సుల ప్లానింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2024 ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అప్పటివరకు పూర్తిగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉండబోతున్నారు. రామాయణం నేపథ్యంలో ఉండే కథకు త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ ఒక సంచలనం తీసుకురాగలదని అభిమానులు భావిస్తున్నారు. సంక్రాంతి అనంతరం ఈ సినిమాపై కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్.

ఫౌజీ పాపకు మరో జాక్ పాట్.. డిమాండ్ అలా ఉంది మరి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus