Allu Arjun: పుష్ప2 సినిమా తర్వాత బన్నీ ప్రాజెక్ట్ ఇదేనా?

  • January 18, 2023 / 07:03 PM IST

స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి స్థాయిలో ఉన్నారు. వరుస విజయాలు బన్నీ స్థాయిని మార్చేశాయి. ప్రస్తుతం బన్నీ పుష్ప2 సినిమాలో నటిస్తున్నారు. పుష్ప2 సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదలవుతుందో లేక వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుందో స్పష్టత రావాల్సి ఉంది. బన్నీ తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ విషయంలో ఎంతో కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ బన్నీతో సినిమా చేయాలని భావిస్తున్నారని సమాచారం.

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అంటే మినిమం గ్యారంటీ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ మినహా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. స్టార్ హీరోలను, సీనియర్ హీరోలను బాబీ బాగా హ్యాండిల్ చేయగలరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తాజాగా బన్నీ బాబీ కలిశారని బన్నీ బాబీని తన కోసం అద్భుతమైన కథ సిద్ధం చేయాలని కోరారని సమాచారం అందుతోంది.

బాబీ అద్భుతమైన కథను సిద్ధం చేస్తే మాత్రం బన్నీ బాబీ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశాలు అయితే ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథ నచ్చితే బన్నీ బాబీకి ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వాల్తేరు వీరయ్య సక్సెస్ తో బాబీ రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

వాల్తేరు వీరయ్య సినిమాకు 20 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల స్థాయిలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. బాబీ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. బాబీ ఒక్కో ప్రాజెక్ట్ కు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కనుందని సమాచారం అందుతోంది. దర్శకుడిగా బాబీ స్థాయి అంతకంతకూ పెరుగుతోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus