Allu Arjun: కెరీర్ తొలినాళ్లలో బన్నీకి అలాంటి అవమానాలా.. అసలేమైందంటే?

  • August 28, 2023 / 07:25 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి నుంచి పుష్ప ది రైజ్ వరకు మెజారిటీ సినిమాలతో సక్సెస్ లను అందుకున్నారు. బన్నీ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. రుద్రమదేవి సినిమా కోసం బన్నీ రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా నటించారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బన్నీతో ఒక సినిమా అయినా తీయాలని చాలామంది నిర్మాతలు క్యూ కడుతుతున్నారు. పుష్ప ది రైజ్ సినిమాకు వచ్చిన అవార్డులు, ప్రశంసలతో భాషతో సంబంధం లేకుండా బన్నీ పేరు మారుమ్రోగుతోంది.

అయితే బన్నీ (Allu Arjun) మాత్రం కెరీర్ తొలినాళ్లలో నేను బాలేనని రిజెక్ట్ చేశారని ప్రముఖ బ్యానర్ లో ఈ అవమానం నాకు ఎదురైందని చెప్పుకొచ్చారు. గంగోత్రి సినిమాకు ముందే ఒక సినిమా కోసం నేను వెళ్లగా నేను బాలేనని చెప్పి ఆ పెద్ద బ్యానర్ నన్ను తప్పించిందని అల్లు అర్జున్ అన్నారు. గంగోత్రి సినిమా విడుదలైన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని అయితే ఆర్య సినిమా తర్వాత కెరీర్ విషయంలో వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని బన్నీకామెంట్లు చేశారు.

ప్రస్తుతం బన్నీ 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్నారు. స్టార్ హీరో అల్లు అర్జున్ కు పారితోషికంతో పాటు మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. బన్నీ ప్రస్తుతం పుష్ప2 సినిమాకే పరిమితమయ్యారు. పుష్ప2 సినిమాలో బన్నీ పాత్ర తను సంపాదించిన డబ్బుతో గ్రామాల రూపురేఖలను మారుస్తాడని తెలుస్తోంది.

విదేశాల్లో కూడా పుష్ప2 సినిమా షూటింగ్ జరగనుందని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. బన్నీసినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్లు సైతం అదుర్స్ అనేలా వస్తున్నాయి. పుష్ప2 తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో బన్నీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. బన్నీ రేంజ్, క్రేజ్, పాపులారిటీ పెరుగుతోంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus