విజయ్ దేవరకొండ స్టయిల్ నచ్చుతుంది అంటున్న అల్లు అర్జున్

ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ సారికొత్త స్టైల్స్ తో మెస్మరైజ్ చేస్తాడు కాబట్టే అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అని పేరొచ్చింది. అలాంటిది ఈ హీరోకి ఇద్దరు హీరోల స్టైలింగ్ అంటే చాలా ఇష్టమట. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ స్టయిల్ తనకు బాగా నచ్చుతుందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తెలిపాడు.తనకు విజయ్ దేవరకొండ బాగా నచ్చుతాడని.. అతడు చాలా కష్టపడుతున్నాడని అన్నారు. అతడు స్టయిల్ ఎంతో నచ్చుతుందని చెప్పారు.

vijay devarakonda with Allu Arjun

అలానే బాలీవుడ్ హీరోల్లో రణవీర్ సింగ్ డ్రెస్సింగ్ బాగా నచ్చుతుందని.. ఆయన దుస్తుల ఎంపిక చాలా బావుంటుందని చెప్పారు. అతడిలా ప్రత్యేకమైన బట్టలు వేసుకొని ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. ప్రత్యేకమైన డ్రెస్సింగ్ ఉండాలంటే అలాంటి యాటిట్యూడ్ కూడా ఉండాలని చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆదివారం నాడు విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus