Allu Arjun, Dhanush: బన్నీ ధనుష్ లను కలిపే డైరెక్టర్ ఆయనేనా?

గత కొన్నేళ్లలో టాలీవుడ్ సినిమాల మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగింది. పదేళ్ల క్రితం పెద్ద సినిమాలకు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి నిర్మాతలు కంగారు పడగా ప్రస్తుతం 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. శాటిలైట్, డిజిటల్ హక్కుల విలువ అంచనాలకు మించి పెరగడంతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలను విడుదల చేసి ఆ సినిమాలతో సక్సెస్ సాధిస్తుండటంతో టాలీవుడ్ సినిమాల మార్కెట్ పెరిగింది.

Click Here To Watch NOW

చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధమైందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. బన్నీ ధనుష్ హీరోలుగా కొరటాల శివ భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ ఆచార్య రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారు. ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసిన వెంటనే కొరటాల శివ బన్నీ ధనుష్ కాంబో మూవీపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.

బన్నీ లేదా కొరటాల శివ స్పందిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కొరటాల శివ సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ఆయన సినిమాలకు సంబంధించి వైరల్ అవుతున్న వార్తల విషయంలో స్పష్టత రావడం లేదు. కొరటాల శివ సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కొరటాల శివ భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

సినిమాసినిమాకు కొరటాల శివ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న టాలీవుడ్ డైరెక్టర్లలో కొరటాల శివ కూడా ఒకరు. కొరటాల శివ డైరెక్షన్ లో నటించడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus