Allu Arjun Family: కుటుంబంతో సరదాగా గడుపుతున్న అల్లు అర్జున్‌.. ఫొటోలు వైరల్‌!

ఇటు వృత్తి జీవితం, అటు వ్యక్తిగత జీవితం… రెండింటినీ బ్యాలెన్స్‌ చేయడం ఎలానో మన సినిమా స్టార్‌ హీరోలను చూసి నేర్చుకోవాలి. సినిమాల మీద సినిమాలు చేస్తూనే, గ్యాప్‌ వచ్చినప్పుడు ఫ్యామిలీ ట్రిప్‌లు వేస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్‌ కూడా అదే పని చేశాడు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా అల్లు అర్జున్‌ కుటుంబంతో కలసి రాజస్థాన్‌ చెక్కేశాడు. అక్కడ ఓ శాంక్చ్యురీలో అల్లు కుటుంబం తీసుకున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మార్చి ఆరున అల్లు అర్జున్‌ – స్నేహ రెడ్డి వివాహ వార్షికోత్సవం. దీంతో అయాన్‌, ఆర్హతో కలసి బన్నీ దంపతులు టూర్‌ వేశారు. రాజస్థాన్‌లోని ప్రముఖ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యురీ అయిన జవాయిలో రోజంతా ఆహ్లాదంగా గడిపారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దాంతోపాటు ఓ వీడియోను కూడా పంచుకున్నారు. అక్కడ వీరు తీసుకున్న ఫొటోలు, వీడియోలు అందులో ఉన్నాయి. అల్లు అర్జున్‌ కెమెరా పట్టుకొని ఫొటోలు తీయడం, పిల్లలతో కలసి సరదాగా నీడలతో ఆటలాడటం చాలా క్యూట్‌గా అనిపించింది.

ముందుగా చెప్పినట్లు నేటి తరం హీరోలు… సినిమాతో పాటుగా ఫ్యామిలీని బాగా హ్యాండిల్‌ చేస్తున్నారు. ఒకప్పటి హీరోలు గతంలో మాట్లాడుతూ… వరుస సినిమాల వల్ల ఫ్యామిలీ లైఫ్‌ను మిస్‌ అయ్యాం అని చెప్పేవాళ్లు. కానీ ఇప్పటి హీరోలకు ఈ పరిస్థితి లేదు. రెండూ చూసుకుంటున్నారు. మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్… ఇలా స్టార్‌ హీరోలు చాలామంది రెండు అంశాలను చక్కగా ప్లాన్‌ చేసుకుంటున్నారు. చిన్న గ్యాప్‌ దొరికినా వెకేషన్‌ ప్లాన్‌ చేస్తామని ఆ మధ్య మహేష్‌బాబు ఓ టీవీ షోలో చెప్పాడు.

గతంలో మహేష్‌ ఇలా ఫ్యామిలీ ట్రిప్‌లు వేయడం మనం చూశాం. ఇక చాలా రోజుల తర్వాత నా భర్త నన్ను వెకేషన్‌కి తీసుకెళ్తున్నాడు అంటూ ఈ మధ్య ఉపాసన ఓ పోస్ట్‌ చేశారు. రామ్‌చరణ్‌తో కలసి దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. హ్యాపీ టు సీ ఆల్‌ దిస్‌ కదా.

1

2

3

More…

1

2

3

4

5

6

7

8

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus