Allu Arjun: ఆ హడావిడి ఇప్పుడు లేదేంటి.. ప్రశ్నిస్తున్న బన్నీ అభిమానులు!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ మూవీ విడుదలకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. మొదట ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించగా వేర్వేరు కారణాల వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడింది. అయితే గతంలోనే ఈ సినిమాకు సంబంధించి రెండు సాంగ్స్ విడుదల కాగా ఈ మధ్య కాలంలో ఈ మూవీకి సంబంధించి ఆశించిన రేంజ్ లో ప్రమోషన్స్ జరగలేదు.

Allu Arjun

పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి అప్పుడు హడావిడి చేసిన స్థాయిలో ఇప్పుడు చేయడం లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ అవసరమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ కు ఇప్పటినుంచి అప్ డేట్స్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఏకంగా మూడేళ్ల సమయం కేటాయించిన నేపథ్యంలో ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించడంతో పాటు కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పుష్ప ది రూల్ మూవీ షూట్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియాల్సి ఉంది. బన్నీ వేగంగా సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప2 సినిమాకు సీక్వెల్ గా పుష్ప3 తెరకెక్కనుంది.

అయితే పుష్ప3 సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? ఎప్పుడు విడుదలవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. అటు బన్నీ ఇటు సుకుమార్ మీడియాకు దూరంగా ఉండటంతో ఈ ప్రశ్నలకు జవాబులు ఎప్పుడు దొరుకుతాయో చూడాలి. మైత్రీ నిర్మాతలు మాత్రం ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారని తెలుస్తోంది. బన్నీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

టాలీవుడ్ సెలబ్రిటీలు అలా చేస్తే మాత్రం కొండా సురేఖకు ఇబ్బందేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus