సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కిన పుష్ప మూవీ పార్ట్1 బడ్జెట్ 180 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. అటు బన్నీ కెరీర్ లో ఇటు సుకుమార్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ పుష్ప పార్ట్1 కావడం గమనార్హం. తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. పుష్ప బాలీవుడ్ లో రిలీజ్ కాదని ప్రచారం జరగగా ఆ వార్తల్లో నిజం లేదని ఇప్పటికే తేలిపోయింది.
సుకుమార్ డైరెక్షన్ లో గతంలో తెరకెక్కిన సినిమాలు క్లాస్ ఆడియన్స్ కు, ఫ్యామిలీలకు నచ్చాయి. రంగస్థలం మూవీలో చరణ్ రగ్డ్ లుక్ లో కనిపించగా ఆ సినిమా కథ, కథనాలు ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకులు ఆ సినిమాను ఇండస్ట్రీ హిట్ చేశారు. అయితే పుష్ప సినిమా ఫ్యామిలీలను ఆకట్టుకుంటుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నటీనటులు డీగ్లామర్ గా కనిపిస్తుండటంతో బన్నీ అభిమానులు సైతం పుష్పకు ఫ్యామిలీలు దగ్గరా? దూరమా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యామిలీలు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తాయో లేదో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. బన్నీ గెటప్, కలర్ టోన్ బాగా రఫ్ గా ఉండటం సినిమాకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో చూడాల్సి ఉంది. బన్నీ తొలి పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్1 కావడంతో ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే బన్నీ తర్వాత సినిమాలకు భారీస్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు.