అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మొదటి భాగం ‘పుష్ప- ది రైజ్’ టైటిల్ తో డిసెంబర్ 17న విడుదల కాబోతుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా సినిమా పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసాయి.
ఇక నిన్నటితో అనగా డిసెంబర్ 8న ‘పుష్ప’ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది.ప్యాచ్ వర్క్ మరో రెండు మూడు రోజుల్లో ఫినిష్ అయిపోతుంది. శనివారం లేదా సోమవారం నాడు సెన్సార్ కు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ చేసినందుకు గాను హీరో అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేస్తూ ‘పుష్ప’ క్రూ మెంబర్స్ కు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. 12 మంది సిబ్బందికి తులం (10 గ్రాములు) విలువైన బంగారు ఉంగరాలను గిఫ్ట్‌గా ఇచ్చి సత్కరించాడు బన్నీ.
ఈ లిస్ట్ లో అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆర్ట్ డైరెక్టర్లు మొదలగు వారు ఉన్నారు. అనంతరం టీం మెంబెర్స్ అందరికీ మంచి ఫుడ్ పార్టీ కూడా ఇచ్చాడట బన్నీ. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పాట కోసం వేసిన సెట్‌లో షూటింగ్ జరిగింది. ఇది అల్లు అర్జున్, సమంతల మధ్య వచ్చే ఐటెం సాంగ్ అట.