Allu Arjun: టాలీవుడ్లో అల్లు అర్జున్ ను భయపెట్టే ఏకైక దర్శకుడు అతనేనట..!

అల్లు అర్జున్.. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న పాన్ ఇండియా స్టార్స్ లో ఒకరు. ఇతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో వర్ణించలేం. క్లాస్, మాస్ అనే తేడా లేదు యూత్, ఫ్యామిలీస్ అనే బేధం లేదు.. చివరికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అతనికి ఎక్కువే..! అల్లు అరవింద్ గారి రెండో అబ్బాయిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్… ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా మారాడు. అంతకు ముందు ‘స్వాతి ముత్యం’ ‘డాడీ’ వంటి సినిమాల్లో నటించాడు కానీ..

అది మనం చెప్పుకుంటే తప్ప చాలా మందికి ఆ విషయం తెలీదు. సో ఆ సినిమాలతో అల్లు అర్జున్ కు ఎలాంటి గుర్తింపు రాలేదు. అయితే ‘గంగోత్రి’ లో చెప్పుకోడానికి… పేరుకు హీరో అంతే..! ఆ సినిమా సక్సెస్ అంతా కీరవాణి సాంగ్స్ కు, కె.రాఘవేంద్రరావు 100వ సినిమా హైప్ కు చెందుతుంది. అయితే అటు తర్వాత తన లుక్స్ మొత్తం మార్చుకుని అల్లు అర్జున్ కష్టపడి స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు లెండి.

ఇదిలా ఉండగా.. డైరెక్టర్స్ తో అల్లు అర్జున్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. తన సినిమాల సక్సెస్ మీట్లకు సీనియర్ దర్శకులను కూడా పిలుస్తూ ఉంటాడు. సుకుమార్, త్రివిక్రమ్ వంటి దర్శకులతో ఇతనికి ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి చెప్పనవసరం లేదు. అయితే ఓ దర్శకుడు అంటే అల్లు అర్జున్ కు మహా భయమట. ఆ దర్శకుడు మరెవరో కాదు సీనియర్ స్టార్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘పెళ్ళాం ఊరెళితే’ సినిమాకి అల్లు అర్జున్ ఎస్వీ కృష్ణారెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడట.

ఆ సినిమాకి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ నిర్మాత. అయితే ఎస్వీ కృష్ణారెడ్డి సెట్ లో బన్నీతో సహా అందరినీ డిసిప్లిన్ గా ఉంచేవారట. అందువల్ల ఎస్వీ కృష్ణారెడ్డి అంటే అల్లు అర్జున్ కు ఏదో తెలీని భయం. ఇప్పుడు కూడా ఆయన ఎదురుపడితే అల్లు అర్జున్ తడబడుతూ మాట్లాడతాడట. ఎందుకు ఆలా అయిపోతారు అని ఎస్వీ కృష్ణారెడ్డి అడిగితే.. ‘ఇండస్ట్రీలో నేను భయపడేది మీ ఒక్కరికే సార్’ అని పెళ్ళాం ఊరెళితే సినిమా జ్ఞాపకాలు చెబుతుంటాడట బన్నీ.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus