ఇప్పటి తరానికి సినిమా మ్యాగజైన్స్ అని చెబితే అవేంటి అని అడుగుతారు. ఎందుకంటే మన దేశంలో సినిమా మ్యాగజైన్ల పరిస్థితి చాలా ఏళ్ల క్రితమే అయిపోయింది. అయితే కొన్ని పోష్ మ్యాగజైన్లు ఉన్నాయి. అంటే సినిమాలకు సంబంధించి, సెలబ్రిటీలకు సంబంధించి కొన్ని మ్యాగజైన్లు రాస్తుంటారు. వాటికి ఆదరణ తగ్గింది. అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అయితే విదేశాల్లో వీటికి ఇంకా ఆదరణ ఉంది. అలాంటి వాటిలో హాలీవుడ్ రిపోర్టర్ ఒకటి.
విదేశీ సినిమాల గురించి చాలా ఏళ్లుగా ఈ మ్యాగజైన్‌ను నడుపుతున్నారు. 1930లో మొదలైన ఈ బుక్ ఇప్పుడు మన దేశానికి వస్తోంది. తొలి ఎడిషన్ త్వరలో తీసుకురాబోతున్నారు. దీని కవర్ పేజీ మీద అల్లు అర్జున్ (Allu Arjun) కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా జీవితంలో లభించిన అతిపెద్ద అవకాశం ఇదే అని భావిస్తున్నా అని చెప్పాడు.
బలం, ఆత్మవిశ్వాసం మనసులో ఉంటాయి. వాటిని ఎవరూ తీసేయలేరు. కొన్ని లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి. ఇవీ అలాంటివే. విజయం తర్వాత కూడా వినయంగా ఉండటం ముఖ్యం. జీవితంలో సక్సెస్ అయిన తర్వాతా ఎలాంటి గర్వం లేని చాలా మందిని నేను చూశాను. అది వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. నేను 100 శాతం సామాన్యుడినే. సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇదే భావనతో ఉంటాను అని చెప్పుకొచ్చాడు బన్నీ (Allu Arjun).
సినిమా షూటింగ్‌లో గ్యాప్ దొరికనప్పుడు విశ్రాంతి మాత్రమే తీసుకుంటా. ఆ సమయంలో ఏమీ చేయకుండా అలా ఉండటమే ఇష్టం. కనీసం పుస్తకం కూడా చదవను అని ఆ వీడియోలో చెప్పాడు బన్నీ. ఇది కేవలం టీజర్ మాత్రమే మ్యాగజైన్‌లో బన్నీ గురించి, పుష్ప (Pushpa) జర్నీ గురించి ఇంకా ఎవరికీ తెలియని విషయాలు తెలిసే అవకాశం. తెలుగు సినిమా స్టార్ హీరోలు తెలుగు మీడియాకు కాకుండా హిందీ, ఇంగ్లిష్ మీడియాకే ఎక్కువ విషయాలు చెబుతారు అనే విషయం తెలిసిందే కదా.