స్మ‌గ్ల‌ర్‌గా మారిన స్టైలిష్ స్టార్.. బీభ‌త్సం ఏ రేంజ్‌లో ఉంటుదో..?

అల వైకుంఠపురములో చిత్రంతో ఆల్‌టైమ్ ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్ర‌స్తుతం, క్రియేటివ్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ పుష్ప మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో బ‌న్ని స్మ‌గ్ల‌ర్‌గా న‌టిస్తున్నవిష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికే గంద‌పు చెక్క‌ల‌తో ప‌ట్టుబ‌డిన స్మ‌గ్ల‌ర్‌గా బ‌న్నీకి సంబంధించి ఫ‌స్ట్ లుక్‌ను, ఆయ‌న పుట్టిన రోజు సందర్భంగా విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ ఫ‌స్ట్‌లుక్ మాస్ మ‌సాల ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉండ‌డంతో, ఈ చిత్రం పై అంచ‌నాలు భారీగా పెరిగాయి.

ఇక‌పోతే పక్కా ప్లాన్‌తో షూటింగ్ ప్రారంభించ‌గా క‌రోనా కార‌ణంగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌కు బ్రేక్ ప‌డింది. అయితే ఇప్పుడు కోవిడ్ ప్ర‌భావం త‌గ్గ‌డంతో పుష్ప టీమ్ తిరిగి షూటింగ్ ప్రారంభించింది. అయితే తాజాగా షూటింగ్ స్పాట్‌లో బ‌న్నీకి సంబంధించిన న‌యా లుక్ సోష‌ల్ మీడియా ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. పుష్ప స్టోరీ బ్యాక్‌డ్రాప్ 1980ల కాలం నాటిది కావ‌డంతో, త‌న‌ని తాను పూర్తిగా మేకోవ‌ర్ చేసుకున్న ఈ స్టైలిష్ స్టార్ లుక్ ప‌క్కా మాసీగా ఉంది.

చింపిరి జుట్టు, మాసిన గ‌డ్డం, అక్క‌డ‌క్క‌డ చిరిగిన ప్యాంటు, క‌రెక్ట్‌గా చెప్పాలంటే, మ‌ట్టి మ‌నిషిగా మారిపోయాడు అల్లు అర్జున్. ఈ పిక్ చూస్తుంటే ఓ పాత్ర‌కి త‌న‌వంతుగా న్యాయం చేసేందుకు బ‌న్ని ఎంత క‌ష్ట‌ప‌డ‌తాడో అర్ధ‌మ‌వుతోంది. అస‌లే సుకుమార్ చెక్కుడు ఏ రేంజ్‌లో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ప‌ర్‌ఫెక్ట్ అవుట్‌పుట్ కోసం త‌న సినిమాల్లో న‌టించే హీరోల‌ను పిండి పిప్పి చేస్తాడు. తాజాగా బ‌న్నీ లుక్ చూస్తుంటే సుకుమార్ క్రియేటివిటీకి అద్దం ప‌డుతోంది.

ఇక క‌థ‌లో భాగంగా ప్ర‌స్తుతం అడ‌వుల్లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. ఈ నేప‌ధ్యంలో, బ‌న్ని, సుకుమార్‌తో పాటు.. ఆ మూవీ టీమ్ మొత్తం షూటింగ్ లొకేష‌న్లో ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. ఇక‌పోతే పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ, తెలుగుతో పాటు ఐదు భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తుండ‌గా, రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి ఈ క్రేజీ హిట్‌ కాంబినేష‌న్ నుండి వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus